Advertisement
Google Ads BL

పుష్ప 2 క్లైమాక్స్ షూట్ లోకి అల్లు అర్జున్


సుకుమార్-అల్లు అర్జున్ మధ్యన ఈగో క్లాషెస్, పుష్ప ద రూల్ రిలీజ్ తేదీ దగ్గర ఇద్దరికి పడడం లేదు, అందుకే అల్లు అర్జున్ కోపం తో పుష్ప 2 సెట్స్ లో కుర్చీని తన్నితే, సుకుమార్ కోపంతో ఐ ఫోన్ పగలగొట్టారంటూ ఏవేవో న్యూస్ లు వినిపించాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేసి ఫ్యామిలీ తో వెకేషన్ కి వెళ్లడం, మరో పక్క సుకుమార్ కూడా విదేశాలకు వెళ్లడం అన్ని అగ్నికి ఆజ్యం పోశాయి. 

Advertisement
CJ Advs

ఇవన్నీ ఎలా ఉన్నా సుకుమార్ ప్రస్తుతం ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ లో తలమునకలై ఉండగా.. అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేసారు. బన్నీ ఇంట్లో ఈమధ్యన స్పెషల్ పూజలు కూడా జరిగాయి. అల్లు అర్జున్ అమ్మగారు, భార్య స్నేహాలు పూజ కార్యక్రమాల్లో కనిపించారు. 

ఇక అల్లు అర్జున్ కూడా కూల్ గా ఆగష్టు మొదటి వారం నుంచి పుష్ప 2 సెట్స్ లోకి అడుగుపెడతాడని తెలుస్తోంది. గత శనివారం నుంచి పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. దీనిలో హీరో  లేని స‌న్నివేశాల్ని ఇత‌ర కీల‌క న‌టీనుటుల‌పై దర్శకుడు సుకుమార్ చిత్రీక‌రిస్తున్నారు. అల్లు అర్జున్ అలాగే ఫాహద్ ఫాసిల్ పై వచ్చే వారం నుంచి క్లైమాక్స్ చిత్రీకరణ సుకుమార్ చేపడతారని తెలుస్తోంది. సో అల్లు ఫ్యాన్స్ దిగులుపడకండి.. పుష్ప1 డిసెంబర్ 6 పక్కా వస్తోంది. 

Allu Arjun into the Pushpa 2 set in the first week of August:

Allu Arjun Prepares for Pushpa 2 Thrilling Climax
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs