Advertisement
Google Ads BL

పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ రియాక్షన్


చాలా రోజుల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది. అందులోను బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్ అందాలు చూపించడానికి ఆరాటపడుతుంది. వీలున్నప్పుడల్లా గ్లామర్ షో చెయ్యడానికిప్రయత్నాలు చేస్తుంది. ఎక్కువగా ట్రెడిషనల్ కనిపించిన కీర్తి సురేష్.. ఈమధ్యన అందాలు ఆరబోసే విషయంలో హద్దులు చెరిపేసింది. 

Advertisement
CJ Advs

అంతేకాదు ఒక పక్క సినిమాల్తో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని వివాహం చేసుకుంది, కాదు కాదు ఆమె ఓ బిజినెస్ మ్యాన్ కి భార్య కాబోతుంది, అదిగో కీర్తి సురేష్ పెళ్లి వేదిక, ఇదిగో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఊరు అంటూ పలు రూమర్స్ వినిపించాయి. 

తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై రియాక్ట్ అయ్యింది. ఇలాంటి రూమర్స్ కి స్పందిస్తూ పొతే అవే నిజమనుకుంటారు. అందుకే ఆ వార్తలపై రియాక్ట్ అవను. నా సినిమాల ఎంపిక, నటనపై ఇచ్చే సూచనలను స్వీకరిస్తాను. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాని నా పర్సనల్ లైఫ్ పై ఎవరైనా మాట్లాడితే అవి నేను పెట్టించుకోను. 

కావాలని ద్వేషం పెంచుకుని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవాళ్లను పట్టించుకోను అంటూ కీర్తి సురేష్ తనపై వస్తున్న పెళ్లి వార్తలకు ఇలా ఇండైరెక్ట్ గా చెక్ పెట్టింది. 

Keerthy Suresh reaction on marriage news:

Keerthy Suresh gives a befitting reply to rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs