Advertisement
Google Ads BL

ప్రభాస్ ప్లానింగ్ వేరయా..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటలీలో కూర్చుని కల్కి 2898 AD చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సలార్, కల్కి బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరోపక్క ప్రభాస్ రాక కోసం దర్శకుడు మారుతి వెయిట్ చేస్తున్నాడు. ప్రభాస్ రాగానే రాజా సాబ్ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నాడు.

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్ తదుపరి చెయ్యబోయే చిత్రంపై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. అంటే ప్రభాస్ లైనప్ లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి మూవీస్ ఉన్నాయి. ఇందులో రాజా సాబ్ చిత్రాన్ని ప్రభాస్ త్వరగా చుట్టెయ్యబోతున్నారు.

ప్రభాస్ తదుపరి చెయ్యబోయే చిత్రం పైనే అందరిలో ఆసక్తి మొదలైంది. అంటే సలార్ 2 సెట్స్ మీదకి వెళ్లాలంటే ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వాలి. ఇక ప్రభాస్ లైనప్ లో స్పిరిట్ మొదలు కావాల్సి ఉండగా.. ప్రభాస్ మాత్రం ముందుగా లవ్ స్టోరీ అయిన హను రాఘవపూడి సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా టాక్.

ప్ర‌భాస్ ముందుగా సందీప్ వంగతో స్పిరిట్ సినిమానే స్టార్ట్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆ సినిమా ప్రీ-ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుండ‌టంతో, ప్ర‌భాస్ ముందుగా హను రాఘ‌వ‌పూడితో సినిమాను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించినట్లుగా తెలుస్తోంది. మరి దీనిని బట్టి ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Prabhas planning is different..:

New and Upcoming Movies Of Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs