Advertisement
Google Ads BL

సూసైడ్ చేసుకోబోయిన రాజ్ తరుణ్ లవర్


సూసైడ్ కు ప్రయత్నించిన రాజ్ తరుణ్ మాజీ లవర్

Advertisement
CJ Advs

రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై.. అతని పక్కన తిరగబడరా సామి చిత్రంలో హీరోయిన్ గా నటించిన మాల్వి మల్హోత్రా పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. రాజ్ తరుణ్ తనని మోసం చేసాడంటూ ఆధారాలు కూడా లావణ్య పోలీసులకి సమర్పించగా వారు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా పై కేసు నమోదు చేసారు. 

ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య కేసు కోర్టులో ఉండగా.. గత రాత్రి లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చెయ్యడం కలకలం సృష్టించింది. రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను.. ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను అంటూ తన లాయర్ దిలీప్ సుంకరకు మెసేజ్ చేసింది. దానితో లాయర్ వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు. లావణ్య కి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. లావణ్య తన సూసైడ్ నోట్ లో పలు సంచలన విషయాలను రాసుకొచ్చింది. రాజ్ లేనిజీవితం ఊహించుకోలేకపోతున్నాను, బతకలేను, అన్నీ కోల్పోయాను. ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. 

నేను ఏంటో బాగా తెలిసిన మనుషులే నన్ను తప్పు పడుతున్నారు. నా చావుకి కారణం రాజ్ తరుణ్, ఆయన తల్లితందులు, రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు.. అంటూ లావణ్య సూసైడ్ నోట్ రాసింది. 

Raj Tharun ex lover Lavanya attempts suicide:

Lavanya after allegations against Raj Tharun, makes suicide attempt
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs