Advertisement
Google Ads BL

ఢీ డాన్స్ షో: ప్రణీత అవుట్ - హన్సిక ఇన్


ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9.30 నిమిషాలకి ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో వెరీ పాపులర్. ప్రస్తుతం ఢీ సీజన్ 16 లో సెలెబ్రిటీ డాన్స్ షో లో రెండో సీజన్ మొదలవ్వబోతుంది. సెలెబ్రిటీ సీజన్ 1 గత బుధవారంతోనే ముగిసింది. సెలెబ్రిటీ ఢీ డాన్స్ షో సీజన్ 1 కి శేఖర్ మాస్టర్ తో పాటుగా ప్రణీత సుభాష్ జెడ్జెస్ గా పని చేశారు. అంతేకాకుండా వారానికో మూవీ టీం ఢీ డాన్స్ షో స్టేజ్ పై సందడి చేసేవి.

Advertisement
CJ Advs

గత వారంతో ఢీ సెలెబ్రిటీ సీజన్ 1 ముగిసింది. ఇక సెలెబ్రిటీ సీజన్ 2 వచ్చే బుధవారం మొదలు కాబోతుంది. ఈ షో నుంచి ప్రణీత సుభాష్ తప్పుకోగా.. మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పాల బుగ్గల, సొట్ట బుగ్గల సుందరి హన్సిక ఢీ డాన్స్ సెలెబ్రిటీ సీజన్ 2 కి శేఖర్ మాస్టర్ తో కలిసి జెడ్జ్ స్థానంలో కూర్చోబోతున్న ప్రోమో ఈటివి వదిలింది.

హన్సిక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా.. టాలీవుడ్ ఆమె హవా చూపించలేకపోయింది. కానీ తమిళనాట హన్సిక క్రేజీ హీరోయిన్ గా మారింది. అక్కడ తమిళ తంబీలతో పూజలు అందుకుంది. ఇక గత ఏడాది పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిన హన్సిక ప్రస్తుతం కెరీర్ లో అంత జోష్ చూపించడం లేదు.

ఇప్పుడు హన్సిక తెలుగు డాన్స్ షో అయిన ఢీ షో కి జెడ్జ్ గా రావడం ఆ షో పై క్రేజ్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. వచ్చే బుధవారం నుంచి హన్సిక ఢీ డాన్స్ షోలో గ్లామర్ గా సందడి చేయబోతుంది. 

Dhee Dance Show: Praneetha Out - Hansika In:

Hansika as Judge in Dhee Celebrity Special-2 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs