Advertisement

రిలాక్స్ మోడ్ లో పవన్


ఏపీలో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పడిన కష్టము ఆయన ఎప్పుడూ షూటింగ్స్ లో కూడా పడి ఉండరేమో.. ఎండలో పడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వడగాలిని లెక్కచెయ్యకుండా చమటలు చిందించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ.. తాను నిలబెట్టిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తిరిగారు.

Advertisement

ఎప్పుడూ ఏసిలో ఉండే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం కఠిన శిక్షణ తీసుకున్న రోజులు ఉన్నప్పటికి.. ఈ ఎన్నికల్లో పవన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. మరి ఎన్నికలు ముగిసాయి. పవన్ కళ్యాణ్ భార్యతో కలిసి వారాణసికి వెళ్లి అక్కడ మోడీ నామినేషన్ చూసుకుని కాశీవిశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ ఖాళీ అయ్యారు. రేపో మాపో షూటింగ్స్ కి వచ్చేస్తారని అనుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ భార్య పిల్లలతో కలిసి రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ కి వెళ్ళినట్టగా తెలుస్తోంది. ఎన్నికల హీట్ తట్టుకుని నిలబడిన పవన్ కళ్యాణ్ ఎన్నికల రిజల్ట్ వచ్చెలోపు కాస్త వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు ట్రిప్ కి వెళ్లారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాలు, షూటింగ్ పక్కనబెట్టి రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. 

Pawan in relax mode:

Pawan Kalyan with his family after the election
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement