Advertisement

వైసీపీ - టీడీపీ మధ్య రేవ్ పార్టీ వార్!!


టైటిల్ చూడగానే కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును సోమవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న విషయం రేవ్ పార్టీ. బెంగళూరు వేదికగా జరిగిన ఈ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులు.. ముఖ్యంగా టాలీవుడ్, ఏపీలోని వైసీపీకి చెందిన మంత్రి పేరిట ఉండే కారు కనిపించడం.. మరోవైపు జనసేన స్టార్ క్యాంపెయినర్, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పట్టుబడటంతో ఇది కాస్త వైసీపీ Vs టీడీపీ, జనసేనగా పరిస్థితులు మారిపోయాయి. అక్కడ దొరికింది ఎవరు..? ఏం చేస్తూ ఇలా అడ్డంగా బుక్కయ్యారు..? అనే విషయాలు అందరూ మరిచిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవడాన్ని చూస్తే ఇదేం పోయే కాలం బాబోయ్ అనిపిస్తుంది.

Advertisement

ఇదీ అసలు సంగతి!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో 100మందికి పైగా తెలుగు రాష్ట్రాలు చెందిన వ్యక్తులు పట్టుబడ్డారు. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు నటి హేమ, జానీ మాస్టర్.. ఇతర నటీనటులు ఉన్నారు. తొలుత అబ్బే.. నేను కాదు అస్సలు కాదబ్బా ఇదిగో ఫాం హౌస్ లో ఉన్నానని హేమ చేసిన వీడియో పార్టీ జరిగిన ప్రాంతంలోనిదేనని ఫోటోలతో బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. ఇక పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఉన్న ఒక వీడియోలో ఇంకా చాలా మంది నటులు కనిపించారు. ఇక వైసీపీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాలూకు కార్లు కనిపించడంతో అసలు రచ్చ మొదలైంది. కాకాణి బండారం బట్టబయలు అయ్యిందని టీడీపీ, జనసేన రచ్చ రచ్చే చేయగా.. మేమేం తక్కువ కాదని జానీ మాస్టర్ వీడియోలు, పవన్ తో కలిసున్న ఫోటోలను తెగ వైరల్ చేసింది వైసీపీ.

కారుకు రెక్కలు వచ్చాయా..?

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో మంత్రి కాకాణి కుటుంబ సభ్యులు ఎందుకు ఉన్నారు .? బట్టలు విప్పుకుని డ్యాన్సులు వేసే రేవ్ పార్టీలో కాకాణి పాస్ ఉన్న కారు ఎందుకు ఉంది? అనేది టీడీపీ సందిస్తున్న ప్రశ్న. అసలు ఆ కారు అక్కడికి ఎందుకు వెళ్ళింది..? రెక్కలొచ్చి నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళ్లిందా..? లేకుంటే మంత్రి కూడా ఉన్నారా..? లేకుంటే మంత్రి మనుషులు ఉన్నారా..? లేదంటే మంత్రి పిల్లలు ఏమైనా వెళ్ళారా..? అనేది ఇంత వరకూ తెలియని.. సమాధానం లేని ప్రశ్న. ఈ వ్యవహారంపై కాకాణి నుంచి.. వైసీపీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు కానీ రివర్స్ కౌంటర్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేసింది వైసీపీ. 

జానీ.. జానీ.. ఎస్ పాప!

కాకాణి గురుంచి స్పందించడానికి వెనుకాడిన వైసీపీ.. జానీ మాస్టర్ ను మాత్రం గట్టిగానే టార్గెట్ చేసింది. రేవ్ పార్టీ నుంచి బయటకొస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో జానీ మాస్టర్ ఉండటంతో ఇక చూస్కోండి.. ఒక్కటే తిట్లు, బూతులు సోషల్ మీడియాలో వినిపించాయి.. కనిపించాయి. కొందరు ఐతే ఏకంగా సెటైర్లు వేస్తున్నారు. జానీ.. జానీ.. ఎస్ పాప.. బెంగళూరు ఎందుకు వెళ్ళావో.. అక్కడ ఏమేం చేసావో చెప్పమ్మా..? అంటూ వైసీపీ కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి. ఇంతకీ ఆయన జానీ మాస్టర్ అవునా.. కాదా..? అనేది క్లారిటీ రాలేదు కానీ వైసీపీ మాత్రం ఫోటోలు, వీడియోల్లో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. అటు టీడీపీ, జనసేన.. ఇటు వైసీపీ విమర్శలు, ప్రతి విమర్శలు.. కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి. మొత్తానికి చూస్తే.. ఈ రేవ్ వ్యవహారం మాత్రం ఇండస్ట్రీని కాస్త సైడ్ చేసి.. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. చూడాలి మరి.. ఫలితాలు ఎలా వస్తాయి అనేది జూన్ నాలుగో తేదీన చూద్దాం..!!

YCP vs TDP:

Bangalore Rave Party: YCP vs TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement