Advertisement

పవిత్రతో పాటే.. చంద్రకాంత్ ఆత్మహత్య


బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంట వెంటనే ఇద్దరు సీరియల్ నటులు మరణించడం అనేది బుల్లితెర ప్రేక్షకులకు షాక్ అనే చెప్పాలి. నాలుగు రోజుల క్రితమే త్రినయని సీరియల్ పవిత్ర జయరాం రోడ్ యాక్సిడెంట్ లో మరణించగా.. ఇప్పుడు ఆమె సహా సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని పవిత్ర జయరాం నివాసంలో శుక్రవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. 

Advertisement

చంద్రకాంత్ తెలుగులో త్రినయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నటి పవిత్ర జయరామ్‌తో చంద్రకాంత్ కి ఆరేళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు, 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు.. ఆతర్వాత  పవిత్ర తో కలిసి ఉంటున్నాడు. 

అయితే పవిత్ర మరణం తర్వాత చంద్రకాంత్ పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ పవిత్రపై ప్రేమని చూపించడంతో.. పవిత్ర మృతిని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. చందు మరణవార్త తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చందు ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. 

అయితే చంద్రకాంత్ అలియాస్ చందు శిల్ప ను స్కూల్ డేస్ వయసు నుండి ప్రేమించమంటూ 3 ఏళ్లు వెంటపడ్డాడు, శిల్పా ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకొని వివాహం 2015లో చేసుకున్నారు. కానీ సీరియల్స్ లో బిజీ అయ్యి పవిత్ర పరిచయం తర్వాత శిల్పాకి ప్రత్యక్ష నరకం చూపించాడు అంటున్నారు.  

కొన్ని నెలలపాటు శిల్పను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టడమేకాకుండా ఆమెని డైవర్స్ ఇచ్చేయమని వేధించేవాడు. చందు గురువారం రాత్రి కూడా  సూసైడ్ ప్రయత్నం చెయ్యడమే కాకుండా.. శుక్రవారం మధ్యాహ్న నుండి ఎవరి ఫోను చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్ తలుపులు బద్దలు పట్టుకొని వెళ్లి చూడగా చందు పవిత్ర ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నట్లుగా తెలిసింది.

After The Demise Of Pavitra Her Co-star Chandu Committed Suicide:

Serial Artist Chandrakanth Passed Away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement