Advertisement

జగన్ను తిట్టిపోస్తున్న వైసీపీ క్యాడర్, ఫ్యాన్స్!


అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. సొంత పార్టీ శ్రేణులు, వీరాభిమానులు ఒక రేంజిలో టిట్టేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల జరిగిన ఎన్నికలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలే. ఎంత సేపూ ప్రజలు, పైనున్న దేవుడు చూసుకుంటాడు.. గెలిపిస్తారు అని పదే పదే చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం, పార్టీ అస్సలు చూడమని ఇలా చాలానే సినిమాను మించి డైలాగ్స్ జగన్ నోటి వెంట వచ్చేస్తుంటాయ్. కానీ 2024 ఎన్నికలు జరిగిన తీరు, వైసీపీని ఆదరించిన తీరుతో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఎంత సేపూ నా ప్రజలు, నా దేవుడు అనడం ఇకనైనా మానండి.. అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Advertisement

ఇదీ సంగతి..!

ఒకరా ఇద్దరా వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు బాబోయ్ ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. ఇదిగో ఒక వీరాభిమాని చేసిన పోస్టును కాస్త నిశితంగా చూడండి.. అసలు సినిమా ఏంటి అనేది అర్థం అవుతుంది. తప్పో ఒప్పో గతం గతః ఏదెలా ఉన్న ఇప్పుడు చిక్కిన అధికారాన్ని పదిలం చేసుకోండి. ఏసుక్రీస్తు కథలు చెప్తే వినడానికి పోపో పాల్స్ లేరిక్కడ.. శిలువ మీద గూటాలు కొట్టి గోడకు వేలాడదీస్తారు. నువ్వు ఇంటింటికీ మేలు చేశానంటున్నావు.. సరే నీ ఆలోచన సరైనదే అయితే శతృవులు ఎక్కడ నుండొచ్చారు?. ఇక్కడే రెండే దారులు ఒకటి జగన్ ప్రేమిష్ఠ్.. రెండు జగన్ ద్వేషిష్ఠ్..! ద్వేషాన్ని నువ్వు అమృతం పంచినా అది ప్రేమగా మారదు. నువ్వు కల్పించే భయం వల్లనే ప్రేమ అన్నది పెరగక పోయినా.. ద్వేషం అక్కడే అణిగిపోయి పెరగకుండా అక్కడే నిలిచి పోతుంది. కులం చూడం, మతం చూడం.. ప్రాంతం చూడం అన్న తమరి సిద్ధాంతాన్నే తమరి అభిమానులు ఫాలో అవుతున్నారు. తమరికంటే కాస్త ఇంకాస్త ముందడుగేసి మేము పార్టీ కూడ చూడం అనేటంత వరకు పిచ్చి ఎగపాకింది..!

ఇది కూడా చూడండి..!!

గుండెలపై చేయి వేసుకుని ఆలోచించండి మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసిన వాళ్లలో ఎందరు కిందిస్థాయి నాయకులను కార్యకర్తలను నిలుపుకున్నారు? లేదే? ఏమిటీ లోపం? ఆ ఎదవలకు అవసరానికి పార్టీనే కానీ ఆదాయానికి మాత్రం బంధువులు బినామీలు..! అలాంటప్పుడు కిందిస్థాయి కార్యకర్తలకు మీరు కల్పించిన భరోసా, ధైర్యం ఏమిటి? లేనప్పుడు ఎలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఆలోచించుకుని అభిమానులను పెంచుకోండి. అతిపడిన ఎదవలను అణగదొక్కండి. ముందా.. పైన దేవుడుండాడు అన్న పదం వదిలెయ్యండి. ఆయనకు మాత్రం మిగత పనులుండవా? అంటూ వీరాభిమానులు తిట్టేస్తున్నారు. ఈ సందేశం ఎంతవరకూ వైసీపీ పెద్దలు, కీలక నేతలకు చేరుతుంది..? అనేది చూడాలి మరి.

YCP cadre and fans are insulting Jagan!:

Jagan vs YCP cadre
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement