Advertisement

అల్లు అర్జున్ ని అడ్డంగా వాడేస్తున్న వైసీపీ


దొరక్క దొరక్క వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఒకరికి పాన్ ఇండియా స్టార్ క్యాంపెయినింగ్ దొరికింది. అసలు ఈసారి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి పోసాని కృష్ణమురళి తప్ప.. ఏ ఒక్క సినీ సెలెబ్రిటీ వైసీపీకి సపోర్ట్ చెయ్యలేదు. రోజా అంటే వైసీపీ పార్టీలో మినిస్టర్ కాబట్టి ఆమె ఓకె. ఆలీ లాంటి వాళ్ళు కూడా ఈసారి వైసీపీ కి దూరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ గా అల్లు అర్జున్ దొరికాడు. 

Advertisement

నంద్యాల వెళ్లి తన స్నేహితుడు వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ తన ఫ్రెండ్ కి ఓటేయ్యమని అడిగాడు, అంతే వైసీపీ సోషల్ మీడియా యాక్టీవ్ అయ్యింది. అల్లు అర్జున్ వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. 

అల్లు అర్జున్ వైసీపీ కి మద్దతునిచ్చాడు, కనక ఆయన అభిమానులంతా వైసీపీ కి ఓటెయ్యాలంటూ డబ్బాలు కొట్టుకుంది. అల్లు అర్జున్ పోస్టర్స్ తయారు చేసి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని, వాలంటీర్ల కోసం జగనన్నకు మన ఓటు, అమ్మవడి కోసం జగనన్నకు మన ఓటు అంటూ అల్లు అర్జున్ ఫోటో మధ్యలో పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. 

మరి అల్లు అర్జున్ నా ఫ్రెండ్ ఏ పార్టీ అయితే నాకేంటి, అతన్ని సపోర్ట్ చెయ్యడానికే వచ్చాను అని, వైసీపీ పార్టీతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. 

YCP is using Allu Arjun horizontally:

Allu Arjun visit to house of Nandyal YSRC candidate 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement