Advertisement

బిగ్ బాస్ రైతు బిడ్డకి డైమండ్ గిఫ్ట్


బిగ్ బాస్ సీజన్ 7 ప్రచారం లో ఉన్నప్పుడు కన్నా విన్నర్ గా బయటికొచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చేసిన రచ్చ ఆ తర్వాత జైలుకెళ్ళడం ఇవన్నీ హాట్ టాపిక్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ అండతో, అమర్ దీప్ పై ఫైట్ చేస్తూ రైతు బిడ్డగా సింపతీ క్రియేట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా చాలా షో చేసాడు. రాష్ట్రంలో రైతులందరికీ సేవ చెయ్యాలంటే నేను సీఎం అవ్వాలన్నట్టుగా మట్లాడేవాడు. 

Advertisement

అదలా ఉంటే సీజన్ విన్నర్ గా 50 లక్షలతో పాటుగా హౌస్ లో గెలిచినవారికి 15 లక్షల విలువ చేసే డైమండ్ జ్యువెలరీ ఇస్తామని జ్యోసలుకాస్ షోరూం వారు చెప్పారు. ఇక విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ తనకొచ్చిన దానిలో చాలావరకు రైతులకి సహాయం చేస్తా అన్నాడు. అన్నట్టుగానే ఈమధ్యన ఆ సహాయం పూర్తి చేసాడు. అయితే విన్నర్ గా 50 లక్షలు గెలవాల్సిన పల్లవి ప్రశాంత్ కి యావర్ 15 లక్షల సూట్ కేసు తీసువెళ్లడంతో అతనికి కేవలం 35 లక్షలు వచ్చాయి. అందులోని సగానికి సగం ట్యాక్స్ లే పోయింది. 

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన ఐదు నెలలకి పల్లవి ప్రశాంత్ కి 15 లక్షల విలువైన డైమండ్ జ్యువలరిని అక్షయ తృతీయ సందర్భంగా అందించడంతో ఆ డైమండ్ నెక్ లెస్ ని తన తల్లికి ఇచ్చినట్టుగా పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో.. ఓ..  విన్నర్ పల్లవి ప్రశాంత్ డైమండ్ జ్యువెలరీ గెలుచుకున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. 

Pallavi Prashanth gifted with diamond necklace:

Big Boss Pallavi Prashanth gifted with diamond necklace
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement