Advertisement
Google Ads BL

టిల్లు స్క్వేర్: మొన్న చిరు - నేడు తారక్


గత శుక్రవారం మంచి అంచనాలు నడుమ విడుదలైన సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మొదటి షోకే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. టిల్లు గా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం, మ్యూజిక్, BGM అన్ని టిల్లు స్క్వేర్ హిట్ లో భాగమయ్యాయి. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం విడుదలైన నెక్స్ట్ డే నే మెగాస్టార్ చిరు టిల్లుని వీక్షించడమే కాదు.. హీరో సిద్దు, నిర్మాత నాగ వంశి, దర్శకుడు మల్లిక్ ని ఇంటికి పిలిపించుకుని అభినందినందిస్తూ టిల్లు స్క్వేర్ తప్పక చూడాల్సిన చిత్రమని చెప్పారు. 

రోజు రోజు కి కలెక్షన్స్ పరంగా కొత్త నెంబర్లు ని నమోదు చేస్తున్న టిల్లు స్క్వేర్ ని ఇప్పుడు దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించడం హాట్ టాపిక్ అయ్యింది. గత రాత్రి ఎన్టీఆర్, మరో హీరో విశ్వక్ సేన్ తో కలిసి సిద్దు కొన్నలగడ్డ, నిర్మాత నాగ వంశి వీరంతా టిల్లు స్క్వేర్ ని వీక్షించడంతో పాటుగా ఆ యంగ్ హీరోలతో ఎన్టీఆర్ దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ సెల్ఫీ, సిద్దు తో కలిసి ఫోటో దిగడం టిల్లు స్క్వేర్ కి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కాని.. ఎన్టీఆర్ ని ఇలా కుర్ర హీరోలతో పిక్స్ దిగడం చూసి ఆయన అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

Jr NTR enjoys Tillu Squar:

Jr NTR Watched Tillu Square
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs