టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుంది అనుకున్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు వరస వైఫల్యాలతో నిరాశలోకి వెళ్ళిపోయింది. వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా.. కానీ శ్రీలీల కేరెక్టర్ కి తగిన ప్రాధాన్యత లేకపోవడం, ఆయా చిత్రాలు ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లడం అన్ని వెనువెంటనే జరిగిపోయాయి. దానితో పాప డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం శ్రీలీల విజయ్ దేవరకొండ తో మొదలు కాబోయే VD13 కోసం వెయిట్ చేస్తుంది.
అయితే ఈ అందమైన బ్యూటిఫుల్ శ్రీలీల డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది, ఇంకా డాక్టర్ విద్యనభ్యసిస్తుంది. శ్రీలీల మదర్ ఫేమస్ గైనికాలజిస్ట్. మరి డాక్టర్స్ ఫ్యామిలీ అంటే డైట్ విషయంలో ఎన్ని రూల్స్ పాటిస్తారో, హెల్త్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అనేది వేరే చెప్పక్కర్లేదు. అలాగే శ్రీలీల కూడా చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేసినా శ్రీలీలకి మాత్రం బేకరీ ఐటమ్స్ చాలా ఇష్టమట. దానితో తన తల్లి కంటపడకుండా బెంగుళూరులోని బేకరీస్ అన్ని తిరిగేసి మరీ కొత్త కొత్త ఐటమ్స్ అన్ని లాగించేసేడట. ఇప్పటికి అదే అలవాటుని కొనసాగిస్తుందట శ్రీలీల.
శ్రీలీలకి మల్బరీ క్రీమ్ తో తయారు చేసిన షాధూమ్ మలై అంటే చాలా ఇష్టమట. ఫోన్ లో పుడ్ ఆర్డర్ ఐటమ్స్ చూస్తే ఈ ఐటమ్ ని శ్రీలీల ఖచ్చితంగా ఆర్డర్ పెడుతుందట. ఇక బేకరీ ఫుడ్ మాత్రమే కాదు.. శ్రీలీలకి హైదరాబాద్ వచ్చాక బిర్యానీ తినడం కూడా బాగా ఇష్టంగా తయారైందట.