Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్


అల్లు అర్జున్ ఎప్పుడూ మెగాస్టార్ కి ఫ్యానే. కానీ సినిమాలో మెగాస్టార్ కి ఫ్యాన్ గా అల్లు అర్జున్ కనిపిస్తే అభిమానులకి పూనకాలే. ఇదెప్పుడు, ఎక్కడ జరిగింది అంటే.. పుష్ప రాజ్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ద రూల్ చేస్తున్న అల్లు అర్జున్ పార్ట్ 2 లో మెగాస్టార్ చిరుకి వీరాభిమానిగా కనిపిస్తాడట. ఇప్పటికే దానికి సంబందించిన కొన్ని సీన్స్ సుకుమార్ చిత్రీకరించారని, ఇంద్ర రిలీజ్ సమయంలో అంటే 2000 ఏడాది తర్వాత పుష్ప రాజ్ చిరుకి ఫ్యాన్ గా కనిపిస్తాడన్నమాట. పుష్ప ద రైజ్ 1990 ఫ్లాష్ బ్యాక్ అన్నప్పటికీ 1980 కన్నా ముందు నుంచే ఉంటుంది. మరి ఇప్పుడు 2 కి అయితే పుష్ప రాజ్ పాత్ర 2000 లోకి కూడా వస్తుంది.

Advertisement
CJ Advs

అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా పుష్ప రాజ్ తన ఫొటోలతో ఫోటోలు వేయించడం, థియేటర్స్ దగ్గర తన వాళ్లతో హంగామా చెయ్యడం వంటివి చేస్తూ కనిపిస్తాడట. మరి ఈ సన్నివేశాలని అందరికి కనెక్ట్ అయ్యేలా సరదాగా సుకుమార్ చిత్రిస్తున్నారట. ప్రస్తుతం అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్స్ కోసం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడి నుంచి తిరిగిరాగానే పుష్ప ద రూల్ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుంది. అల్లు అర్జున్-రష్మిక -ఫహద్ ఫాసిల్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ సుకుమార్ చేపడతారని తెలుస్తుంది. పుష్ప 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న రిలీజ్ కాబోతుంది.

Allu Arjun turns Megastar Fan in Pushpa 2:

Allu Arjun aka Pushpa To Be Seen As Die-Hard Megastar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs