Advertisement

చంద్రబాబుకు బెయిల్..


టీడీపీకి ఒక్కొక్కటిగా విజయం చేరువవుతోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం ప్రతీకారేచ్ఛకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇబ్బందుల పాలయ్యారు. చంద్రబాబును ఊపిరి ఆడనంతగా కేసులు బనాయించి ఇక మీదట ఆయనను జైలు నుంచి బయటకు రానివ్వకుండా పకడ్బందీగా స్కెచ్ గీసింది. తాజాగా జగన్ ప్లాన్స్ అన్నీ కోర్టుల ముందు పటాపంచలవుతున్నాయి. టీడీపీకి తిరిగి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. వరుసగా కోర్టుల్లో టీడీపీకి అనుకూలంగా తీర్పులు వెలువడుతున్నాయి. స్కిల్ స్కామ్‌లో నిన్నటికి మొన్న నారా లోకేష్‌కు భారీ ఊరట లభించింది. 

Advertisement

లోకేష్‌పై స్కిల్ స్కామ్ కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసింది. ఇదిలా ఉండగా చంద్రబాబుకు సైతం మొన్న ఓ కేసులో కాస్త ఊరట లభించగా.. నేడు అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ లభించింది. నేడు లక్షరూపాయలు పూచీ కత్తుతో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. నిజానికి డీ హైడ్రేషన్ కారణంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్మ సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబం కూడా కలత చెందుతోంది. ఈ క్రమంలోనే నేడు ఆయనతో సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ములాఖత్ కానున్నారు.

టీడీపీ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన నేపథ్యంలో అంగళ్లు కూడలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికార పార్టీకి చెందిన ఫిర్యాదుదారు, వైసీపీ మద్దతుదారులు ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది రక్షణగా నిలిచారు. మొగుణ్ని కొట్టి మొరపెట్టుకున్న చందంగా వైసీపీ వాళ్లే దాడి చేసి తిరిగి టీడీపీ అధినేత సహా ఇతర నేతలపై కేసు పెట్టారు. కనీసం ఈ ఘటనలో ఫిర్యాదుదారుతో సహా ఆయన అనుచరులకు ఎలాంటి గాయాలు కాకున్నా కూడా గాయాలైనట్టు ఓ మెడికల్ రిపోర్టును క్రియేట్ చేసి మరీ కేసులు బనాయించారు.ఈ కేసులో ఇప్పటికే నిందితులందరికీ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేడు చంద్రబాబుకు కూడా బెయిల్ లభించింది. నేడు సుప్రీంలో క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. దీనిలో కూడా పక్కాగా అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Bail for Chandrababu..:

Former CM Chandrababu Naidu Gets Anticipatory Bail in Angallu Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement