Advertisement
Google Ads BL

దేవరలో ఆ పాత్ర చాలా కీలకం


యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాలశివ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవరపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. దేవర కి సంబందించిన ఏ అప్ డేట్ అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. షూటింగ్ కామ్ గా జరుగుతున్నా.. దేవర సోషల్ మీడియా హ్యాండిల్ నుండి అభిమానులకి అందాల్సిన అప్ డేట్స్ అందించేస్తున్నారు. తాజాగా దేవరపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న న్యూస్ ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో చేస్తున్నట్టుగా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూసే. దానికి కనెక్ట్ అయ్యేలా ఇప్పుడు కనిపించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అది #Devara లో తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట ! ఆ పాత్రలో #JrNTR నట విశ్వరూపం 🔥 🥵 చూస్తారంటూ.. ఈ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది అంటూ.. రాసుకొచ్చారు. 

మరి ఇలాంటి ఫైర్ ఉన్నన్యూస్ లు కనబడితే అభిమానులు ఆగుతారా.. అడ్డదిడ్డంగా సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారూ.. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శంషాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ కొత్త షెడ్యూల్  కోసం ఇప్పటికే హైదరాబాద్ వచ్చారు. ఇక ఎన్టీఆర్-జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ కొరటాల అతి త్వరలో చేపడతారని తెలుస్తోంది. 

That role is very important in Devara:

A Powerful flashback episode in NTR Devara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs