Advertisement
Google Ads BL

కాబోయే భార్య-చెల్లెలితో వరుణ్ తేజ్


లావణ్య త్రిపాఠితో ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని.. ఇప్పుడు పెళ్ళికి సిద్దమయిన వరుణ్ తేజ్.. త్వరలోనే లావణ్య మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు. జూన్ 9 న ఎంగేజ్మెంట్ అంటూ అప్పటివరకు తమ ప్రేమని బయటపెట్టకుండా సీక్రెట్ లవ్ ని మైంటైన్ చేసిన వరుణ్ తేజ్ రీసెంట్ గా గాంధీవధార అర్జున్ తో డిసాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ తాజాగా భార్య తో జిమ్ లో.. తన చెల్లెలు నిహారిక తో రాఖి కట్టించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. ఇక్కడ కాబోయే భర్త వరుణ్ తో కలిసి జిమ్ కి వెళుతున్న లావణ్యతో వరుణ్ తేజ్ దిగిన పిక్ షేర్ చేసాడు. అలాగే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా వరుణ్ తేజ్ కి ఆయన చెల్లెలు నిహారిక రాఖీ కట్టిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

అటు కాబోయే భార్య తో జిమ్ వేర్ లో కనిపించిన వరుణ్ తేజ్ ఇటు చెల్లెలి దగ్గర మాత్రం ట్రెడిషనల్ బాయ్ లా కనిపించాదు. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ వరుణ్ తేజ్ లావణ్య తో నిహారిక తో కనిపించి కనువిందు చేసాడంటున్నారు. వరుణ్-లావణ్య ల వివాహం నవంబర్ లో జరగబోతుంది అని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Varun Tej with his fiancee-sister:

 Varun Tej Rakhi With Sister, Gym With Fiance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs