Advertisement
Google Ads BL

నాగార్జున ఏదో కొత్తగా చెబుతున్నారే..


కింగ్ నాగార్జున కొత్త సినిమా కబురందుతుంది అంటే.. ఆయనేమో పదే పదే బిగ్ బాస్ ప్రోమోస్ తో స్టార్ మాలో కనిపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కి సమయం ఆసన్నమవుతూ ఉండడంతో యాజమాన్యం కొత్త కొత్త ప్రోమోస్ తో ఆసక్తిని కలిగించే ప్లాన్ చేసి ఒక్కొక్కటిగా వదులుతున్నారు. గత మూడు సీజన్స్ గట్టిగా వర్కౌట్ అవ్వకపోవడంతో ఈసారి సీజన్ 7 ని సరికొత్తగా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేసేలా ఉండాలి అని చూసుకుంటున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోస్ డిఫ్రంట్ గా ఉండేలా ప్లాన్ చేసారు. 

Advertisement
CJ Advs

తాజాగా నాగార్జున కొత్త ప్రోమోతో  వచ్చేసారు. అందులో ఒక అమ్మాయి తన లవర్ ని లోయలో పడకుండా ఆపేందుకు చున్నీ ఇస్తుంది. ఇంతలో నాగ్ ఎంట్రీ ఇచ్చి.. ఇలాంటి క్లైమాక్స్ రొటీన్.. కొత్తగా కాదు.. ఊహించని విధంగా ఉండాలంటే అంటూ మళ్ళీ ఆ అమ్మాయి చున్నీ వేసి లాగుతున్న సమయంలోనే తుమ్మొచ్చి చున్నీ వదిలేస్తుంది. అతను లోయలో పడిపోతాడు.. ఈసారి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడాలు, తొండి ఆడడాలు అలాంటివేం ఉండవు.. ఆట కొత్తగా ఉంటుంది అంటూ నాగార్జున చెబుతున్నారు. 

ఎవరి ఊహకి అందని సీజన్.. బిగ్ బాస్ సీజన్.. అంతా ఉల్టా-పల్టా అంటూ నాగార్జున సీజన్ 7 పై భీభత్సమైన హైప్ ఇచ్చేసారు. బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 సెప్టెంబర్ 3 నుండి మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Nagarjuna is saying something new..:

Bigg Boss Season 7 Unexpected Promo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs