Advertisement
Google Ads BL

BRO విషయంలో అందుకే ఆందోళన


పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వలన ఆయా నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, అక్కడి మంత్రులపై చెలరేగిపోయి మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలని ఏపీలో ఆడనిస్తారా.. గతంలో భీమ్లా నాయక్ అప్పుడే పవన్ కి ఆయన నిర్మాతలకి ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపించింది. ఇప్పుడు కూడా రేపు 28 న రాబోతున్న #BRO పరిస్థితి అలానే ఉంటుందా.. అంటే నిజమేనేమో.. ఉండినా ఉండొచ్చు అంటున్నారు.

Advertisement
CJ Advs

అందుకే #BRO ని ఎక్కువ మొత్తంలో కొన్నవారు ఇప్పుడు తెగ ఆందోళన పడుతున్నారట. 100 కోట్ల భారీ టార్గెట్ తో బ్రో బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది అంటున్నా.. ఇప్పుడు బ్రో కలెక్షన్స్ 50 కోట్లు అయినా దాటతాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలిటికల్ హీట్ లో #BRO సినిమా కలక్షన్లు 50 కోట్లు అయినా దాటేనా ? అధికార పక్షం పవన్ సినిమాని తొక్కిపడేయకుండా వదిలేస్తుందా? టికెట్ రేట్లు తగ్గించి, బెనిఫిట్ షోలు ఆపించి, అణచివేస్తుందా? అలా చేస్తే సింపతీ వర్కవుట్ అయ్యి పవన్ కల్యాణ్ లాభ పడితే, మొదటికే మోసం వస్తుంది, అది ప్రభుత్వానికి మరింత నష్టం జరుగుతుంది అనే భయం కూడా వైసీపీ నేతల్లో ఉంది.

ఇది పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో ఉన్న అనుమానం మాత్రమే కాదు. ప్రతి ఒక్క సినీ లవర్ గుండెల్లో ఉన్న ఫీలింగ్. నిజంగానే పవన్ కళ్యాణ్ పై కత్తి కట్టి ఆయన సినిమాని తొక్కేయాలని చూస్తే నిర్మాతలు నష్టపోయినా.. అక్కడ పవన్ ప్రభావం బాగా పెరుగుతుంది. ప్రజల్లో పవన్ పై సింపతీ క్రియేట్ అవుతుంది. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం #BRO ని కొన్నవారు కంగారు పడుతున్నారనే న్యూస్ బాగా వినిపిస్తుంది.

Bro Pre release business update:

Pawan Kalyan BRO pre-release business details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs