Advertisement
Google Ads BL

ఇంత అదృష్టం ఏ హీరోయిన్‌కి దక్కదేమో?


టాలీవుడ్ శ్రీలీల నామ జపం చేస్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇంతిలా శ్రీలీల పేరు పలవరిస్తుంది అని ఊహించలేదు. ఈరోజు నిజంగా ఏ హీరోయిన్ కి దక్కని అదృష్టం శ్రీలీల కి దక్కింది. ఈరోజు జూన్ 14 సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన శ్రీలీల లుక్స్ మాత్రమే కనిపించాయి. ఏ హీరోయిన్ ఎలాంటి పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసినా ట్రెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియా మొత్తాన్ని శ్రీలీల ఆక్యుపై చేసింది. దాదాపు పది ప్రాజెక్ట్స్ లో శ్రీలీల నటిస్తుంది. అందులో రెండు మూడు ఈ ఏడాది రావడం పక్కా అనుకుంటే.. ఇప్పుడు ఆమె పుట్టిన రోజు స్పెషల్ గా ఆమె లుక్స్ వదిలారు చూడండి.. అమ్మో వర్ణిస్తూ చెప్పడం చాలా కష్టం.

Advertisement
CJ Advs

మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం మొదలు.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వరకు శ్రీలీల లుక్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. ఉదయం ముందుగా శ్రీలీలకి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఆర్టికల్స్ కనిపించగా.. ఆతర్వాత గుంటూరు కారంలో శ్రీలీల బ్యూటిఫుల్, ట్రెడిషనల్ లుక్ బయటికి వచ్చింది. ఆ వెంటనే బాలకృష్ణ భగవంత్ కేసరి నుండి సింపుల్ శ్రీలీల దర్శనమిచ్చింది. ఆతర్వాత ఉస్తాద్ రామ్ సినిమా నుండి మోడరన్ శ్రీలీల లుక్ వచ్చేసింది.

ఒక్కో సినిమాలో శ్రీలీల ఎలా ఉంటుందో.. ఎలాంటి లుక్స్ లో కనిపిస్తుందో అనుకుంటే.. శ్రీలీల బర్త్ డే స్పెషల్ గా వదులుతున్న లుక్స్ లో ఒకదానికి ఒకటి  పొంతన లేదు. అన్నీ డిఫరెంట్ లుక్స్. అందరూ చాలా అలెర్ట్ గా శ్రీలీల లుక్స్ ని డిజైన్ చేసారు. శ్రీలీల కూడా ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ తో మెస్మరైజ్ చేసింది. నితిన్-వక్కంతం సినిమా నుండి శ్రీలీల పాత్రను పరిచయం చేస్తూ దానికి డేంజర్ పిల్ల అనే క్యాప్షన్ పెట్టారు.

వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుండి ఎల్లో శారీ లో శ్రీలీల అందాలు అద్భుతః అన్న రేంజ్ లో కనిపించాయి. అంతలోనే అల్లు అర్జున్ తో ఆహా ఒరిజినల్ కోసం జత కట్టిన డాన్స్ పిక్ ని వదిలారు. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బుంగమూతి పెట్టిన శ్రీలీల దిగింది. మరి ఏ హీరోయిన్ కి ఈ రేంజ్ లో ఇంతవరకు పుట్టిన రోజు స్పెషల్ లుక్స్ అందలేదు అనిపించేలా శ్రీలీల లక్కీ గర్ల్ గా కనిపించింది. 

సోషల్ మీడియాలో ఏ ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా శ్రీలీల, శ్రీలీల ఇదే పేరు కనిపించింది అంటే ఏ రేంజ్ లో శ్రీలీల ట్రెండ్ అయ్యిందో అర్ధమవుతుంది. ఇక నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ సినిమాలు ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకపోవడంతో ఆ సినిమాల నుండి శ్రీలీల లుక్స్ బయటికి రాలేదు. లేదంటే ఆ సినిమాల నుండి కూడా శ్రీలీలకి బర్త్ డే విషెస్ పోస్టర్స్ అందేవే.

Which heroine is so lucky?:

Sreeleela Birthday special look in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs