Sharwanand Provides Clarity on Car Accident
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117మరో ఐదు రోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్న హీరో శర్వానంద్ కి కారు ప్రమాదం అనగానే ఆయన అభిమానులు కంగారు పడిపోయారు. రక్షిత రెడ్డితో వివాహం జరగబోతుంది.. పెళ్లి పత్రికలు పంచాల్సిన శర్వానంద్ సడన్ గా కారు యాక్సిడెంట్ కి గురి కావడంపట్ల చాలామంది భయపడ్డారు. అయితే శరానంద్ కి పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు, ఆయన బాగానే ఉన్నారు, కారుకి చిన్న చిన్న గీతలు మాత్రం పడ్డాయి. ఎవరికీ ఈ ప్రమాదంలో గాయాలవలేదు అంటూ ఆయన టీమ్ అప్పుడే చెప్పింది. అయినా శర్వానంద్ ఎలా ఉన్నాడో అనే అనుమానంతోనే ఆయన ఫాన్స్ ఉన్నారు.
అందుకే తనకి జరిగిన ప్రమాదంపై శర్వానంద్ స్పీడుగానే స్పందించాడు. ఈరోజు మార్నింగ్ నా కారు ప్రమాదానికి గురైనట్టుగా వార్తలొచ్చాయి. అది చాలా చిన్న ప్రమాదం, నాకేమి కాలేదు. పూర్తి ఆరోగ్యంతో ఫిట్ గా ఉన్నాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. ప్రమాదం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా గురించి ప్రార్దించిన వారందరికీ థ్యాంక్స్ అంటూ శర్వా తనకి జరిగిన ప్రమాదంపై క్లారిటీ ఇచ్చాడు.
హీరోగారే తనకి ఏమి కాలేదు, చాలా చిన్న ప్రమాదమని చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శర్వానంద్ రక్షిత రెడ్డిని జూన్ 3 న వివాహం చేసుకోబోతున్నాడు. రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ - రక్షిత రెడ్డిలు రాయల్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు.