Advertisement

ఇలాంటి సమయంలో ఆహా సాహసం


అల్లు అరవింద్ గారు ముగ్గురు పార్ట్నర్స్ తో కలిసి తెలుగులో ఆహా అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ని నిర్మించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అరవింద్ ఆహా ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది. ఆహా నుండి కొత్త సినిమాల రిలీజ్ లు, సూపర్ హిట్ సినిమాల స్త్రీమింగ్స్, వెబ్ సీరీస్ లో, గేమ్ షో లు, డాన్స్ షోస్, సింగింగ్ షోస్, వంటల ప్రోగ్రామ్స్ అంటూ అతి తక్కువ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆహాకి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆహాని తమిళంలోనూ లాంచ్ చేసారు. తెలుగు, తమిళ్ లో ఆహా అనిపిస్తున్న అరవింద్.. ఇప్పుడు ఆహా న్యూస్ పేపర్ కి శ్రీకారం చుట్టారు.

Advertisement

పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్, ఆహా ఆ ఊహే ఎంత బాగుందో కదా!! అందుకే రాబోతుంది ఆహా దినపత్రిక 🗞️ మీ ముంగిట్లోకి... #ahaVarthalu అంటూ అనౌన్స్ చేసారు. ఆహా వార్తలు న్యూస్ పేపర్ జులై 1 నుండి అందుబాటులోకి రాబోతుంది. ఆహా వార్తలు అంటూ బాగానే ఆలోచించారు కానీ.. ఈ సమయంలో ఆహా వారి ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది సందేహమే. ఎందుకంటే ప్రస్తుతం అందరూ ఫోన్స్, టీవీలలో న్యూస్ లు చూడడానికి  అలవాటు పడిపోయి.. న్యూస్ పేపర్ చేతబుచ్చుకుని కాఫీ తాగే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు.

60 ప్లస్ వ్యక్తులు, రిటైర్ అయినవారు కాఫీ తాగుతూనో.. లేదంటే ఉదయాన్నే పేపర్ చూసుకుంటూ వార్తలు చదువుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు 60 ప్లస్, 70 ప్లస్ ఎవరైనా కూడా కష్టపడుతూ ఖాళీ సమయంలో ఫోన్ నొక్కుతూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ లో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్స్ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయిన సమయంలో ఆహా వారు ఇలా న్యూస్ పేపర్ వదలడం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Aha news paper coming soon:

Allu Aravind and Co planning Aha news paper
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement