Advertisement

మనోజ్ నా తమ్ముడు అంటూ విష్ణు వివరణ


అన్న మంచు విష్ణు తన అనుచరులపై చేస్తున్న దౌర్జన్యాన్ని మంచు మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి పెను సంచలాన్ని సృష్టించాడు. మంచు మనోజ్ ఎప్పటినుండో అన్న విష్ణుని విభేదిస్తూ వేరుగా ఉంటున్నాడు. మంచు విష్ణు-మోహన్ బాబు దగ్గర పనిచేసే సమీప బంధువు సారధి కొంతకాలంగా విష్ణు కి దూరంగా మనోజ్ దగ్గర ఉంటున్నాడు. సారధిపై విష్ణు దౌర్జన్యాన్ని మంచు మనోజ్ వీడియో తియ్యడం కలకలం సృష్టించింది. పోనీ దానితో అన్నని బెదిరించాడా లేదే.. ఏకంగా మంచు విభేదాలను మనోజ్ ఈ వీడియోతో రచ్చకీడ్చాడు. 

Advertisement

దానితో మోహన్ బాబు రంగంలోకి దిగి మనోజ్-విష్ణులకి సర్ది చెప్పి మనోజ్ చేత వీడియో డిలేట్ చేయించి.. అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలే.. వీటిని పెద్దవి చేయకండి అని మీడియాని రిక్వెస్ట్ చేశారు. మనోజ్ కూడా వీడియో డిలేట్ చేసాడు. అప్పటికే మంచు వారి మధ్యన మంట బజారున పడింది. ఈలోపు మంచు విష్ణు సోషల్ మీడియాలో మంచు మనోజ్ తన తమ్ముడు, తాను చిన్నవాడు.. నిన్న ఉదయం జరిగిన చిన్న సంఘటన, నేను సారధితో పడుతున్న గొడవని మ‌నోజ్ ఆప‌లేక‌పోయాడు. అందుకే వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మ‌నోజ్ కి ఏమి తెలియదు, చిన్నవాడు, ఆ వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విష‌యం కాదు అంటూ విష్ణు వివ‌ర‌ణ ఇచ్చారు.

అటు మంచు విష్ణు సారధి ఇంటికి గొడవపడేందుకు వెళుతున్న సమయంలోనే మనోజ్, లక్ష్మి ఆ గొడవ ఆపేందుకు వెళ్లి అక్కడే మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ వివాదంపై మోహన్ బాబు, మంచు విష్ణు వేర్వేరుగా స్పందించినా.. లక్ష్మి మాత్రం మీడియా ప్రశ్నలను దాటుకుని వెళ్ళిపోయింది.

Vishnu on Manoj Video:

Manchu Vishnu reacts Manchu Manoj Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement