Advertisement
Google Ads BL

SSMB28: ఆ రెండిటిలో ఏది ఫైనల్


మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా క్రేజీగా మూవీగా తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఆగష్టు 11 రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే-శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా.. జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం. దీనికోసం జగపతి బాబు స్పెషల్ గా మేకోవర్ కూడా అయ్యారనే టాక్ ఉంది. త్రివిక్రమ్ జగపతి బాబుని ఈ చిత్రంలో కొత్తగా చూపించబోతున్నారట. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా కి మొదటి నుండి అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఇదే టైటిల్ SSMB28 కి పెడతారని అనుకున్నారు. ఎక్కువగా మొదటి అక్షరం అ తో మొదలవడం, అలాగే మూడక్షరాల టైటిల్ మీద ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ చూపించే త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న మూడో మూవీ కోసం అయోధ్యలో అర్జునుడు అయితే బావుంటుంది అనుకున్నారట. కానీ ఇప్పడు మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. అదే అత‌డే త‌న సైన్యం అనేది కొత్త టైటిల్  గా వినబడుతుంది. ఈ రెండిటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.

అయితే వచ్చే బుధవారం కొత్త సంవత్సరం అంటే ఉగాది రోజున SSMB28 టైటిల్ అలాగే మహేష్ లుక్ ని రివీల్ చేస్తారని అంటున్నప్పటికీ.. జస్ట్ టైటిల్ ఇచ్చి లుక్ ని ఆపుతారని తెలుస్తుంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. 

SSMB28: Which of the two is final?:

SSMB28: Title to be announced for Ugadi!?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs