Advertisement
Google Ads BL

రాజమౌళి ప్లానింగ్ అదుర్స్ అబ్బ


రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడూ సూపరే. ఆయన తెలివితేటలూ ఎవ్వరికి అందనివి. అప్పుడు బాహుబలిని తీసుకోండి. దానిని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేసి అద్భుతమైం హిట్ కొట్టి.. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ దారి పట్టించడం వరకు రాజమౌళి గొప్పదనాన్ని పొగడకుండా ఉండలేరు. ఇవ్వాళ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడమే కాదు.. జనవరి నుండి రాజమౌళి మరియు కీరవాణి, కార్తికేయలు అమెరికాలోనే ఉండి.. ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కర్స్ కి తీసుకొచ్చేవరకు ఎంతగా కష్టపడ్డారో ప్రతి ఫ్రెమ్ లో కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక్కడ 80 కోట్లు అయ్యిందా.. లేదంటే 100 కోట్లు ఖర్చు అయ్యిందా అనేది పక్కన పెట్టేయ్యాలి, అలాగే ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సాధిస్తుందా, లేదా కూడా వదిలేయ్యాలి. అయితే ఇక్కడ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వస్తుందా.. లేదా అనేది ఆలోచించకుండా.. ముందు ఇలాంటి స్టేజ్ పై టాలీవుడ్ పేరు, అలాగే తెలుగు దర్శకులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు గట్టిగా వినిపిస్తే, ఆయన నెక్స్ట్ మూవీకి మర్కెట్ విషయంలో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఆయన తన పని తాను సులువుగా చేసుకోవచ్చు. అమెరికాలో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా.. ఎంత తెలుగు సినిమాని ప్రమోట్ చేసినా.. టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసేవారుండరు. 

కనుక ఇప్పుడు అమెరికాలో హాలీవుడ్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ పేరు ఇలా వినిపించడంతో టాలీవుడ్ పేరు మార్మోగిపోతోంది. హాలీవుడ్ లెజెండ్స్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా రాజమౌళి తన ప్లాన్ ని వర్కౌట్ చేసి ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ బరిలో నిలిచేలా చేసి.. తన తదుపరి మూవీపై హాలీవుడ్ మీడియా, అక్కడి మేకర్స్ దృష్టి పడేలా చెయ్యడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీగా చేసారు.

రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే మూవీ పాన్ వరల్డ్ మూవీగా ఉండబోతుంది అనేది తెలిసిన విషయమే. ఆ సినిమాకి మర్కెట్ చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ అవార్డు కోసం చేస్తున్న హడావిడి చూస్తే ఖచ్చితంగా రాజమౌళి-మహేష్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. అప్పుడు ఈజీగా ఆ సినిమాకి హాలీవుడ్ లోను మార్కెట్ అవుతుంది. ఇది రాజమౌళి అసలు సిసలైన ప్లానింగ్. అందుకే ఇంత హడావిడి, అంత ఖర్చు. ఏదైనా రాజమౌళి ప్లానింగ్ అదుర్స్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Rajamouli Planning Adhurs Abba:

Naatu Naatu song from RRR to be performed at the Oscars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs