Advertisement
Google Ads BL

జబర్దస్త్ నుండి అందుకే బయటికి వచ్చేసా..


జబర్దస్త్ నుండి ఇప్పుడు చాలామంది బయటికి వచ్చేసి వేరే ఛానల్స్ లో కామెడీనో.. లేదంటే వెండితెర మీద వెలిగిపోతూనో కనిపిస్తున్నారు. ఇప్పుడంటే.. సుధీర్, అభి లాంటి వాళ్ళు బయటికి వచ్చేసినా గతంలో జబర్దస్త్ మొదలైన కొత్తలో వేణు, ధనరాజ్, శ్రీను లాంటి వాళ్ళు గ్రూప్ లీడర్స్ గా స్కిట్స్ చేసి ఫెమస్ అయ్యారు. వేణు, ధనరాజ్ అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని ఫేమ్ జబర్దస్త్ స్టేజ్ పై చేసిన కామెడీకి దక్కింది. దానితో వాళ్ళు ఫెమస్ అయిన తర్వాత జబర్దస్త్ వదిలేసారు. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు జబర్దస్త్ లోకి వెళ్ళలేదు. అప్పట్లో వేణు, ధనరాజ్ వీళ్లంతా ఏదో గొడవల వలనే జబర్దస్త్ నుండి బయటికొచ్చారనే టాక్ కూడా ఉంది.

Advertisement
CJ Advs

ధనరాజ్ బయటికొచ్చాక కమెడియన్ గా, హీరోగా, దర్శకుడిగా ఇలా చాలా రకాలు వేషాలు వేసాడు. ఇక రీసెంట్ గా వేణు కూడా బలగంతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసాడు. బలగం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన బలగం సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. దానితో మరోసారి దిల్ రాజు వేణుకి మార్ ఛాన్స్ ఇవ్వడంతో.. ఈసారి భారీ బడ్జెట్ తోనే వేణు రాబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే తాజాగా వేణు ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ నుండి తాను బయటికి వెళ్ళడానికి అసలు కారణాలను చెప్పాడు. తాను వివాదాల కారణంగా జబర్దస్త్ నుండి వెళ్ళిపోలేదని క్లారిటీ ఇచ్చాడు. మొదటి నుంచి కూడా సినిమాల్లోనే ఉండాలి అనేది తన కోరిక, అందుకే సినిమాలో రెగ్యులర్ గా కొనసాగాలని ఆలోచనతోనే బయటకు వచ్చేసినట్లుగా చెప్పిన వేణు తాను జబర్దస్త్ నుండి బయటకు వచ్చినప్పుడు జబర్దస్త్ రేటింగ్ దాదాపు 18 ఉండేది. మంచి పారితోషకం, పేరుకి పేరు వచ్చేది కాబట్టి అప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సినిమాలు కోసం నేను బయటికి వచ్చేయాల్సి వచ్చింది.. అంటూ వేణు అసలు జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన కారణం బయటపెట్టాడు.

Venu Clarifies That Why He Came Out From Jabardasth:

Jabardasth Venu clarifies why he came out from Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs