Advertisement
Google Ads BL

కిరాక్ మూడ్ లో కిరణ్ అబ్బవరం


రాజుగారు రాణిగారు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే.. ప్రేక్షక హృదయాలకి దగ్గరైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత SR కల్యాణమండపంలో కట్టుకున్నాడు. తర్వాత వరస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డాడు. కంటిన్యూస్ ప్లాప్స్ తర్వాత కిరణ్ అబ్బవరంకి ఎంతో కొంత రిలీఫ్ నిచ్చిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. గత వారం శివరాత్రి పర్వదినాన ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకులకి వేరే ఛాయస్ కూడా లేకపోవడం వినరో భాగ్యము విష్ణు కథకి కలిసొచ్చింది.

Advertisement
CJ Advs

దానితో వారం తిరిగే లోపే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ వారం కూడా మంచి సినిమాలేవీ లేకపోవడం కిరణ్ అబ్బవరానికి కొంత ప్లస్ అవడం ఖాయం. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి వచ్చిన ఈ చిత్రంలో కిరణ్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా, అందరి మంచి కోరే వ్యక్తిగా కనిపించాడు. ఇక ఈ చిత్రం తర్వాత కిరణ్ ఎలాంటి కథ మీద ఫోకస్ పెట్టబోతున్నాడో చూడాలి. అయితే ఆయన ఫాన్స్ మాత్రం కిరణ్ స్టయిల్ మార్చాలి.. ఇప్పటివరకు ఒకే తరహా కథలతో కనిపించిన కిరణ్ అబ్బవరం కొత్త తరహా కథతో రావాలంటున్నారు.

వినరో భాగ్యము విష్ణు కథ రిజల్ట్ తో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం హ్యాపీ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతో కిరణ్ తదుపరి మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Kiran Abbavaram in happy mode :

Kiran Abbavaram gets a huge relief
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs