Advertisement

వీరసింహా రెడ్డి.. టాక్ ఏంటంటే?


నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 12న) విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో భారీగా విడుదలై.. ఓ షో కూడా పూర్తి చేసుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని థియేటర్లలో 4 గంటలకే షోలు పడ్డాయి. ఏపీలో కొన్ని చోట్ల బెనిఫిట్ షోస్‌కి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన వారి నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే.. 

Advertisement

ఫస్టాఫ్‌లో బాలయ్య ఎంట్రీ సీన్, పెళ్లి ఫైట్, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్, ఏపీ ప్రభుత్వానికి తగిలేలా కొన్ని పంచ్‌లు ఈ సినిమాకి హైలెట్ అనేలా టాక్ నడుస్తుంది. జై, వీరసింహారెడ్డిగా బాలయ్య ఇందులో రెండు పాత్రలు చేశారు. వీరసింహారెడ్డి ప్లాష్ ‌బ్యాక్ ఎపిసోడ్‌‌ని మాత్రం బాలయ్య గత సినిమాలతో పోల్చుతున్నారు. B,C సెంటర్స్ ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా మాస్ ఫీస్ట్ అని అంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ కనుక ఎక్కితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని, ఓవరాల్‌గా అయితే.. కాస్త రొటీన్‌గా అనిపించినా.. బాలయ్య‌కు బలమైన మాస్, యాక్షన్ సన్నివేశాలతో గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడనేలా టాక్ బయటికి వచ్చింది. 

ఇక బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుందని, పండగకి ఎలాంటి సినిమా అయితే వారు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారో.. అలాంటి సినిమానే ఇదని ఒక వైపు వినిపిస్తుంటే.. సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఇది రొటీన్ సినిమాలా అనిపిస్తుందని మరో వైపు టాక్ నడుస్తుంది. ఓవరాల్‌గా అయితే.. ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ టాకే నడుస్తుంది. మరి ఈ హిట్‌ని బాలయ్య సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ దిశగా ఎలా తీసుకెళతాడనేది.. రాబోయే సినిమాల రిజల్ట్‌పై ఆధారపడి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో..? ‘వీరసింహా రెడ్డి’ పూర్తి రివ్యూ మరికొద్దిసేపట్లో..

Veera Simha Reddy First Report Out :

This is The Veera Simha Reddy Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement