Advertisement
Google Ads BL

నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం


నటి ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ ఈరోజు శనివారం అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో కన్ను మూయడంతో ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖుష్బూ అన్నగారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. దానితో ఖుష్బూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పటికి మనతోనే ఉండాలని కోరుకున్నప్పటికీ.. కొన్నిసార్లు వాళ్ళకి గుడ్ బై చెప్పాల్సిన సమయం వస్తుంది.

Advertisement
CJ Advs

ఈరోజుతో మా అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ, గైడెన్స్ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది, ఆయన కోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అన్నయ్య చెప్పినట్టుగా లైఫ్ జర్నీని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ఖుష్బూ ఎమోషనల్ గా పెట్టిన నోట్ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పైన కనబడుతున్న పిక్ ని పరిశీలిస్తే ఖుష్బూ ఎడమచేతి వైపు ఉన్న వ్యక్తి అబ్దుల్లా ఖాన్.

Kushboo brother passed away:

Actress Kushboo Sundar Brother Abdullah khan Passes Away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs