Advertisement

ఢీ డాన్స్ షో స్టేజ్ పై హీరో రవితేజ


హీరో రవితేజ ఈటీవీలో బిగ్ రియాలిటీ షో ఢీ డాన్స్ స్టేజ్ పై మెరిశారు. వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన రవితేజ ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ మూవీలో రవితేజ చిరు తో కలిసి మాస్ స్టెప్స్ వేస్తున్నారు. మరోపక్క ఆయన నటించిన ఢమాకా డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. తాజాగా రవితేజ ఢీ డాన్స్ షో గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా హాజరుకాబోతున్న విషయాన్ని ఈటివి మల్లెమాల యాజమాన్యం కన్ ఫర్మ్ చేస్తూ ప్రోమో వదిలింది. ఢీ డాన్స్ 14 గ్రాండ్ ఫైనలికి రవితేజ అతిధి గా రాబోతున్నారు.

Advertisement

గతంలో ప్రభుదేవా లాంటి వాళ్ళు ఈ షో ఫినాలే ఎపిసోడ్స్ కి వచ్చారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ సీజన్ కి అతిధిగా రావడమే కాదు, జోక్స్ వేస్తూ.. సుడిగాలి సుధీర్ ని ఆట పట్టిస్తూ.. ప్రదీప్ ని ఏడిపిస్తూ, ఢీ డాన్స్ షో స్టేజ్ పై స్టెప్స్ వేసి అభిమానులని ఉర్రుతలూగించారు. ఎన్టీఆర్ వచ్చిన ఢీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సూపర్ క్లిక్ అయ్యింది. ఇక ఓ సీజన్ కి అల్లు అర్జున్ అతిధిగా వచ్చాడు. ఆ ఎపిసోడ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది. తాజాగా ఢీ డాన్స్ షో సీజన్ 14 గ్రాండ్ ఫినాలే కి దగ్గరైంది.

ఈసారి ఢీ డాన్స్ 14 గ్రాండ్ ఫినాలే కి మాస్ మహారాజ్ రవితేజ ని పిలిచారు. మాస్ రాజా ఢీ డాన్స్ ని ఎలా ఊపెయ్యబోతున్నారో.. ఆయన కామెడీ తో, బాడీ లాంగ్వేజ్ తో ఎలా ఆకట్టుకుంటారో అనే క్యూరియాసిటీ మాత్రం అందరిలో మొదలైపోయింది. 

Raviteja to grace Dhee 14 grand finale:

Ravi Teja guest in Dhee dance 14 grand finale episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement