Advertisement

ఎమోషనల్ అవుతున్న చిరు


కొణిదెల శివశంకర వరప్రసాద్‌ గా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ చిరు గా మారిన చిరంజీవి తనని చిరంజీవిగా మెగాస్టార్ గా మార్చిన రోజు సెప్టెంబర్ 22. సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి ఎంతో కష్ట పడి, స్వశక్తితో టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఏర్పరుచుకుని ఇప్పటికి అభిమానుల నుండి ప్రశంశలు అందుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రాణం ఖరీదుతో హీరోగా పరిచయమై నేటికి 44 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దానితో మెగాస్టార్ కాస్త ఎమోషనల్ గా తనను హీరో నిలబెట్టిన రోజు అంటూ ట్వీట్ చేసారు.

Advertisement

మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి.. అంటూ ఎమోషనల్ గా చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మెగా ఫాన్స్ చిరంజీవి హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

Chiranjeevi thanks all the fans and movie lovers:

Emotional Chiranjeevi remembers movie lovers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement