Arvind Swamy in talks for NBK 108
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117రీసెంట్ గా బాలకృష్ణ తో అనిల్ రావిపూడి చెయ్యబోయే NBK108 కోసం తమిళ అగ్ర నటుడు అరవింద్ స్వామిని సంప్రదిస్తున్నారని, ఆల్మోస్ట్ అరవింద్ స్వామి బాలయ్య కి విలన్ గా చేయబోతున్నారని అన్నారు. కానీ ఇప్పుడు అరవింద్ స్వామి అడిగిన పారితోషకం ఇవ్వలేమని వేరే నటుడిని చూసుకునే పనిలో NBK108 మేకర్స్ ఉన్నారని అంటున్నారు. బాలకృష్ణ ని నడి వయస్కుడిగా తన సినిమాలో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడట. పవర్ ఫుల్ లుక్ లో పవర్ ఫుల్ కేరెక్టర్ లో బాలయ్యని చూస్తారని అంటున్నారు.
బాలకృష్ణ తండ్రి పాత్రలో.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కూతురిగా కనిపిస్తారని అనిల్ రావిపూడిని స్వయంగా తెలియజేసాడు. ఇలాంటి కథకి విలన్ గా అరవింద్ స్వామి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని.. అనిల్ రావిపూడి ఆయన్ని సంప్రదించారట. అన్ని ఓకె అయ్యాక అరవింద్ స్వామి పారితోషకం చూసి ఆయన వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అరవింద్ స్వామి ప్లేస్ లో అంత అందమైన నటుడిని NBK108 కోసం విలన్ గా పట్టుకురావాలన్నమాట.