Advertisement

రామ్ చరణ్ మూవీ ఆగిపోలేదు


ప్రస్తుతం రామ్ చరణ్ ఓ బైక్ కంపెనీ యాడ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ బైక్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ కనిపించబోతున్నారు. ఇక త్వరలోనే శంకర్ తో కలిసి రామ్ చరణ్ RC15 కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్ళబోతున్నారు. ఇంతకుముందు వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసి పంజాబ్ వెళ్ళిన RC15 టీం ఇప్పుడు మరోసారి వైజాగ్ కి వెళ్లబోతుంది. అదలా ఉంటే రామ్ చరణ్ తదుపరి మూవీ RC16 ని జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మంగళవారం ఉదయం ఓ ప్రముఖ వెబ్ సైట్ లో RC16 ఆగిపోయింది, కారణం గౌతమ్ కి హిందీలో జెర్శీ ఇచ్చిన షాక్ చూసిన రామ్ చరణ్ కి గౌతమ్ తో సినిమా చెయ్యడం ఇష్టం లేదు. అంతేకాకుండా స్క్రిప్ట్ విషయంలోనూ చరణ్ ఇంట్రెస్ట్ గా లేకపోవడమే కారణం.

Advertisement

అందుకే షూటింగ్ మొదలు పెట్టకుండానే RC16 ని ఆపేశారంటూ ఆ వెబ్ సైట్ లో రాసుకొచ్చారు. కాని RC16 ఆగలేదు అంటూ ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC16 ప్రాజెక్ట్ ఆగలేదు, ఆ సినిమాని ఆపేసారు అనే వార్తలు అన్నీ పుకార్లే. చరణ్ RC15 త్వరగా పూర్తి చేసేసి గౌతమ్ తిన్ననూరి తో కలిసి RC16 సెట్స్ మీదకి వెళ్ళిపోతారు అంటూ చెబుతున్నారు. మరోపక్క మెగా ఫాన్స్ కూడా RC16 ని గౌతమ్ తో చెయ్యడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలను వ్యక్తం చెయ్యడం గమనార్హం.

RC16 film not shelved:

Ram Charan shelved RC 16 Because of Script Differences
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement