Advertisement
Google Ads BL

సోషల్ మీడియా కింగ్ అల్లు అర్జునే


ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ కి మీడియాలో, ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. సోషల్ మీడియాలో స్టార్ హీరోలకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనే విషయంలోనూ ఫాన్స్ లోను, ఆడియన్స్ లోను అంతే ఆసక్తి ఉంది. సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ వేస్తె అది ఏ రేంజ్ లో వైరల్ అవుతుంది అనేది ఆ హీరోల క్రేజ్ ని తెలియజేస్తుంది. అలాగే సోషల్ మీడియా లోనూ క్రేజ్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న సెలబ్రిటీస్ ఉన్నారు. ఇక స్టార్ హీరోస్ లో టాలీవుడ్ లో సోషల్ మీడియాలో క్రేజ్ విషయంలో అల్లు అర్జున్-మహేష్-ప్రభాస్-ఎన్టీఆర్-చరణ్-విజయ్ దేవరకొండ బాగా పోటీపడుతుంటారు. ప్రభాస్ కి ఒక్క ఫేస్ బుక్ అకౌంట్ తప్ప ఇక సోషల్ మీడియాలో ఎక్కడా యాక్టీవ్ గా ఉండడు. అల్లు అర్జున్ ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ మూడిట్లో యాక్టీవ్ గా ఉంటాడు. విజయ్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ ఇలా అందరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నప్పటికీ.. అందరిలో అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కుగా వుంది.

Advertisement
CJ Advs

ట్విట్టర్‌లో మహేష్ బాబు క్రేజ్ బాగా ఉంటే.. ఇన్‌స్టాగ్రాం లో మాత్రం అల్లు అర్జున్ దే హవా. ప్రస్తుతం ఇన్స్టా లో అల్లు అర్జున్ కి చేరువలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. తాజా సర్వే ప్రకారం అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రాంలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ కి ఇన్స్టా లో 19 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఆ తరువాత ప్లేస్ లో విజయ్ దేవరకొండ 17.3 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్నాడు. ఈమధ్యన అల్లు అర్జున్ పుష్ప తో ఇండియా వైడ్ ప్రేక్షకులని, అభిమానులని సంపాదించుకోవడమే కాదు, సోషల్ మీడియాలో పుష్ప రాజ్ గెటప్ లో తరచూ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.

Allu Arjun has now become the most-followed South Indian actor on Instagram:

Actor Allu Arjun has amassed an extraordinary number on Instagram followers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs