Advertisement
Google Ads BL

అందుకే అలియా భట్ పేరు వెయ్యలేదా?


నిన్న సాయంత్రం 7 గంటల నుండే ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ ని ఆయన నటించబోయే కొత్త సినిమాల అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడమే కాదు, ఎన్టీఆర్ బర్త్ డే అంటూ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ ఇంటి ముందు బాణాసంచా కాల్చి, కేక్ కటింగ్ అంటూ నానా హంగామా చేసారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం కూడా ఎన్టీఆర్ ఇంటి పరిసరాల్లో ఆయన అభిమానులు చేసిన హడావిడి కి పోలీస్ లు లాఠీ ఛార్జ్ చెయ్యాల్సి వచ్చింది. ఇక నిన్న కొరటాలతో ఎన్టీఆర్ చెయ్యబోతున్న NTR30 నుండి ఓ స్పెషల్ వీడియో ని రివీల్ చేసారు. దానితో ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఆ వీడియో లో ఎన్టీఆర్ సినిమాకి పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరనుండి, ఎడిటర్, కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పేర్లు రివీల్ చేసారు. కానీ హీరోయిన్ పేరు మాత్రం వెయ్యలేదు.

Advertisement
CJ Advs

NTR30 లోకి అలియా భట్ ని ఆహ్వానిస్తూ హీరోయిన్ పై ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది NTR30 చిత్ర బృందం. ట్రిపుల్ ఆర్ తర్వాత వెంటనే తారక్ తో నటిస్తునందుకు అలియా భట్ కూడా చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడింది. అయితే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యాక అలియా భట్ NTR30 నుండి తప్పుకుంది అని, సౌత్ డైరెక్టర్స్ హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇవ్వరని అలియా ఆ సినిమా తప్పుకుంది అన్నారు. కాదు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో అలియా బిజీ అందుకే NTR30 వదిలేసింది అన్నారు. కొరటాల కూడా అలియా భట్ కి ఇంకా కథ చెప్పలేదు అన్నారు. అయితే నిజంగానే అలియా భట్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందా? అందుకే NTR30 స్పెషల్ వీడియోలో ఆమె పేరు టైటిల్స్ లో వెయ్యలేదు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.

Alia Bhatt Out Of NTR30?:

Too many rumours on Alia Bhatt quitting NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs