Advertisement

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం


ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌.. 

Advertisement

కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌....

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 200మిలియన్ వ్యూస్‌కు పైగా 8.6 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2ను ఏప్రిల్ 14, 2022న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. టీజ‌ర్‌లో చూపించిన‌ట్లు ఓ భారీ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని నిల‌బ‌డిన య‌ష్‌, హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌, రిమికా సేన్ అనే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మ‌రో బాలీవుడ్ స్టార్ ర‌వీనాటాండ‌న్‌, ప్రకాశ్ రాజ్‌, రావు ర‌మేశ్‌, స‌హా చిత్రంలోని ఇత‌ర తారాగ‌ణం వారి వారి డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో క‌నిపిస్తున్నారు. అయితే ప్ర‌ధానంగా పోస్ట‌ర్‌లో చంటిపిల్లాడిని ప‌ట్టుకుని బాధ‌తో గుండెల‌కు హ‌త్తుకున్న అమ్మను కూడా చూడొచ్చు. ఇది సినిమాలోని ఎమోష‌న‌ల్ యాంగిల్ అయిన మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేస్తుంది. 

కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీయఫ్ ఛాప్టర్ 2. వరుస ప్యాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ దక్షిణాది సినిమాల రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు పెంచుతున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఏప్రిల్ 14 2022లో రాబోతున్న ఈ యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. 

KGF Chapter 2 release date: April 14, 2022 :

Prashanth neel - Yash combo KGF Chapter 2 release date locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement