Prakash Raj suffers an injury on set, heads to Hyderabad for a surgery
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117చెన్నై లో ప్రకాష్ రాజ్ కి సినిమా షూటింగ్ సెట్ లో తీవ్రగాయాలు.. ఆయన్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు అంటూ మీడియాలో న్యూస్ రావడం చూసిన అభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. పలు సినిమాల్లో విలన్ గాను, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, మా ఎన్నికల్లో అధ్యక్షుడిగాను పోటీకి రెడీ అయిన ప్రకాష్ రాజ్ కి ప్రమాదం అనగానే అభిమానులు కంగారు పడ్డారు. అయితే ప్రకాష్ రాజ్ కి చెన్నై లో కోలీవుడ్ హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో గాయాలైనట్లుగా వార్తలొచ్చాయి. ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలిచారంటూ సోషల్ మీడియా లో గుప్పుమంది.
అయితే తాజాగా ప్రకాష్ రాజ్ తనకి జరిగిన ప్రమాదం పై స్పందిస్తూ ఓ ట్వీట్ చేసారు. తనకి షూటింగ్ స్పాట్ లో గాయం అయ్యింది అని అది చిన్న ఫ్రాక్చర్ మాత్రమే అని కానీ ఎలాంటి ప్రమాదం లేదని... హైదరాబాద్ లో తన ఫ్రెండ్ డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకి సర్జరీ కోసం వెళ్తున్నానని.. అలాగే తనకి జరిగిన ప్రమాదం పై ఎవరు కంగారు పడక్కర్లేదు.. అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చెయ్యడంతో ఆయన ఫాన్స్ కూల్ అయ్యారు.