Advertisement

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది


టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు వీరోచితంగా పోరాడుతున్నారు. భరత్ తరుపున బరిలోకి దిగిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భరత్ కి పతాకం సాధించిపెట్టింది.   భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు.

Advertisement

చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్ కు బోణి కొట్టారు. భరత్ కి తొలి పథకం సాధించి పెట్టిన మీరాబాయి కి సినిమా ప్రముఖులు, క్రీడా సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tokyo 2020: Mirabai Chanu wins India first medal:

Weightlifter Mirabai Chanu Wins India First Medal At Tokyo Olympics, Bags Silver In Women 49kg
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement