Advertisement

నారప్ప తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో సూపర్ హిట్ అవ్వగానే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే బ్రహ్మోత్సవం ఛాన్స్. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో.. శ్రీకాంత్ అడ్డాలకి ఏ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. కానీ శ్రీకాంత్ అడ్డాలని నమ్మి ఆయన జోనర్ కాని అసురన్ రీమేక్ బాధ్యతలను సురేష్ బాబు - వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టారు. శ్రీకాంత్ అడ్డాలా ఫ్యామిలీ జోనర్ నుండి బయటికొచ్చి పక్కా యాక్షన్ మూవీ నారప్ప ని డైరెక్ట్ చేసాడు. తమిళ ధనుష్ అసురన్ ని మరిపించేలా నారప్ప సినిమాని తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. 

Advertisement

మరికాసేపట్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న నారప్ప పై భారీ అంచనాలే ఉన్నాయి. వెంకీ లుక్స్, నారప్ప ట్రైలర్, ప్రియమణి కేరెక్టర్ అన్ని సినిమాపై ఆశక్తిని పెంచేసాయి. తాజాగా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ నారప్ప సినిమా ఓటిటి లో రిలీజ్ అవడం కాస్త కష్టముగా ఉన్నా.. ఇటువంటి సిట్యువేషన్ లో థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదని అన్నారాయన. ఇక నారప్ప తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చెయ్యబోతున్నట్టుగా శ్రీకాంత్ అడ్డాలా కంఫర్మ్ చేసారు. అది కూడా మూడు భాగాలుగా ఉండబోతున్నట్టుగా శ్రీకాంత్ అడ్డాలా తన తదుపరి మూవీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. 

Srikanth Addala In Geetha Arts Banner:

Srikanth Addala Narappa Interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement