Advertisement

జులైలో ఇంటర్‌ పరీక్షలు


ఏపీ లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటినుండి విద్యార్థులకి పరీక్షలు నిర్వహించాలనే తాపత్రయంతోనే ఏపీ ప్రభుత్వం ఉంది. మే నుండి ఇంటర్, 10th ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా.. మంత్రి ఆదిమూలపు, సీఎం జగన్ లు పరీక్షల నిర్వహణలో ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెబుతున్నారు. పలు రాష్ట్రాలు ఇంటర్, పది పరీక్షలను రద్దు చేసాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతుంది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 

Advertisement

జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని తెలిపారు. ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని.. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాల్సి ఉండగా.. ఈ నెల 20 వరకూ ఏపీ లో కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నట్టుగా ఆదిమూలపు చెప్పారు.

Minister Adimulapu Suresh Press Meet:

Adimulapu Suresh Press Meet On AP 10th and Inter Exams
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement