Advertisement

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు


కరోనా పాండమిక్ టైం లో విద్యా సంస్థలు మూతబడి రెండు నెలలు కావొస్తుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ ఉధృతి ఓ కొలిక్కి వచ్చినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగించారు. అలాగే తెలంగాణాలో 12 గంటల లాక్ డౌన్ జూన్ 20 వరకు అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉధృతిలో విద్యార్థుల ఆరోగ్యం దృష్యా చాలా రాష్ట్రాల్లో పరీక్షల రద్దు కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణాలో పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసారు.

Advertisement

అయితే తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ పలువురు మంత్రులతో ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల‌పై కూడా చ‌ర్చించారు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ స‌రికాద‌ని మంత్రివ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది. ఇక సీఎం కేసీఆర్ మంత్రుల నిర్ణయం మేరకు ఇంట‌ర్ సెకండ్ ఇయర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారంటూ మీడియా మొత్తం తెలంగాణాలో ఇంటర్ పరీక్షల రద్దు న్యూస్ ని పబ్లిసిటీ చేసేశాయి..కానీ మద్యాన్నం సబితా ఇంద్ర రెడ్డి ఇంటర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. కానీ సాయంత్రానికి ఇంటర్ ఎగ్జామ్స్ ర‌ద్దు విషయాన్నీఅధికారికంగా ప్ర‌భుత్వం ప్రకటించింది. దీనితో విద్యార్థుల్లో గందర గోళం పోయి కూల్ అయ్యారు.

Telangana Inter 2nd year exams cancelled:

Telangana Inter 2nd year exams cancelled due to Second wave of Corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement