Advertisement

టాలీవుడ్ లో పూజ హెగ్డే పనైపోయింది


కొన్నాళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరిని చుట్టేసిన పూజ హెగ్డే టాలీవుడ్ సినిమాలను వదిలేస్తుందా? బాలీవుడ్ మూవీస్ తో బిజీ కానున్న పూజ హెగ్డే టాలీవుడ్ ని లైట్ తీసుకుంటుందా? స్టార్ హీరోలకి బెస్ట్ ఆప్షన్ గా మారిన పూజ హెగ్డే ఏదో ఈవెంట్ లో అల్లు అర్జున్ చెప్పినట్టుగా ఇక టాలీవుడ్ హీరోలకి దొరకదా? అందుకే ముంబై లో ఇల్లు కొనేసి సెటిలయ్యిందా? అమ్మో రకరకాల ప్రశ్నలు ఇప్పుడు పూజ టాలీవుడ్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పూజ హెగ్డే టాలీవుడ్ లో నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ఆల్మోస్ట్ ఫినిష్. కొత్తగా ఒప్పుకున్న టాలీవుడ్ మూవీస్ కూడా ఏం లేవు. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది.

Advertisement

ప్రభాస్ తో పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ షూటింగ్ కి ఎప్పుడో ప్యాకప్ చెప్పెయ్యడమే కాదు.. రాధేశ్యామ్ లో పూజ హెగ్డే పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇక మరో భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న పూజ హెగ్డే ఆచార్య షూటింగ్ కూడా ఫినిష్ చేసినట్టుగా అప్ డేట్ ఇచ్చేసింది. సో ఈ మూడు మూవీస్ లో పూజ కేరెక్టర్ కి సంబందించిన చిత్రీకరణ ముగిసినట్టే. ఇవి తప్ప ప్రస్తుతం మరో తెలుగు సినిమా పూజ హెగ్డే చేతిలో లేదు. తమిళ్ లో విజయ్ సినిమా, హిందీలో బడా మూవీస్ తో బిజీగా వున్న పూజహెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమాలను ఒప్పుకోవడం లేదా? లేదంటే ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గాయా? ఏమో ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే పని అయ్యిపోయింది.

Pooja Hegde has worked in Tollywood:

Pooja Hegde is currently starring in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement