Advertisement

టైటిల్ లో మాత్రమేనా వైల్డ్ నెస్.!


సీనియర్ హీరోల్లో ఒకవైపు చిరంజీవి ఆచార్య డేట్ ప్రకటించేసారు. మరోవైపు వెంకటేష్ నారప్ప రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. రీసెంట్ గా బాలయ్య బాబు BB3 రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసారు మేకర్స్. మరి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరిలోనే ఓటిటిలో రిలీజ్ అనుకున్న నాగార్జున వైల్డ్ డాగ్ మాత్రం కామ్ గా కూర్చుంది. అందరి రిలీజ్ డేట్స్ ఒక జాతరలాగా జరిగినా.. నాగార్జున వైల్డ్ డాగ్ మేకర్స్ నుండి స్పందన లేదు. కనీసం అటు ఓటిటికి రావడం లేదు, ఇటు థియేటర్స్ రిలీజ్ అనౌన్సమెంట్  లేకుండా సడన్ గా సైలెంట్ అయ్యిపోయింది.

Advertisement

వైల్డ్ డాగ్ షూటింగ్ ఎక్కడ లేట్ అవుతుందో అంటూ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నప్పుడు ప్రత్యేక విమానంలో కులుమనాలి వెళ్లి వైల్డ్ డాగ్ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్రత్యేక విమానాల్లో బిగ్ బాస్ సెట్ కి వచ్చేసిన నాగ్ ఇప్పుడు వైల్డ్ డాగ్ షూటింగ్ ఫినిష్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని జనవరి 26 నే భారీ డీల్ తో నెట్ ఫ్లిక్క్ష్ లో విడుదల అన్న సినిమాకి ఇంతవరకు ఎలాంటి వార్త, ఎలాంటి కబురు లేదు. సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకటేష్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ రిలీజ్ డేట్స్ ఇస్తుంటే.. నాగ్ ఇలా కామ్ గా ఉండడం అక్కినేని అభిమానులకి రుచించడం లేదు. అందుకే టైటిల్ లోనే వైల్డ్ నెస్.. అయితే అటు ఓటిటిలలో, లేదంటే ఇటు థియేటర్స్ లో దిగు బాబు నాగ్ బాబు అంటున్నారు అక్కినేని అభిమానులు.  

Wildness only in the title? :

Nagarjuna Akkineni Wild Dog to be released on OTT or Theaters?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement