Advertisement

హిట్టు ఎఫెక్ట్ గట్టిగానే ఉందండోయ్


రవితేజ తాజా బ్లాక్ బస్టర్ క్రాక్ ఇంకా కలెక్షన్స్ వేటలోనే ఉంది. రెండు వారాలుగా మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ అదిరిపోయే కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. క్రాక్ సినిమాకన్నా ముందు డిజాస్టర్ ఉన్న రవితేజకి ఈ హిట్ గట్టి ఊపుని, నమ్మకాన్ని ఇచ్చింది. రెండు వారాల్లోనే లాభాల బాట పట్టించిన క్రాక్ సినిమాకి రవితేజకి 12 కోట్ల వరకు పారితోషకం వరకు ముట్టింది. ఇక క్రాక్ తర్వాత రమేష్ వర్మ తో రవితేజ చేస్తున్న ఖిలాడీ సినిమాకి ఏకంగా 13 కోట్ల పారితోషకం అది సింగల్ పేమెంట్ లో నిర్మాతలు సెటిల్ చేశారు. మరి క్రాక్ హిట్ తో రవితేజ రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయింది. డిజాస్టర్స్ ఉన్నప్పుడే రవితేజ పారితోషకం విషయంలో పేచీలు పడేవాడు. ఇప్పుడు మంచి హిట్ పడ్డాక ఊరుకుంటాడా..

Advertisement

ఇక త్రినాధరావు నక్కిన తో రవితేజ ఖిలాడీ తర్వాత చెయ్యబోయే సినిమాకి ఏకంగా 15 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇడియట్ లో రవితేజ వాడిన నేను లోకల్ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. దానినే టైటిల్ గా పెట్టి నాని హీరోగా నేను లోకల్ అంటూ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన త్రినాధ్ రావు నక్కిన ఇప్పుడు డైరెక్ట్ గా రవితేజ తోనే సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా రవితేజ ఎనర్జీకి తగిన సినిమా అని, పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రినాధ్ రావు - రవితేజ కాంబో సినిమా ఉండబోతుందట. మరి ఈ సినిమాకే రవితేజ 15 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు అంటే.. క్రాక్ హిట్ రవితేజకి ఎంతగా కలిసొచ్చిందో చూసారా..

Ravi Teja Hikes His Remuneration:

Ravi Teja to receive massive remuneration for Trinadha rao nakkina movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement