Advertisement

రవితేజా సంక్రాంతి హీరోనా?


కరోనా క్రైసిస్ కి అంతా అతలాకుతలం అయినా.. సినిమా ఇండస్ట్రీ ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. మెల్లగా సినిమాలు థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో రవితేజ క్రాక్ ముందు దిగగా.. తరవాత తమిళనాట నుండి మాస్టర్ విజయ్ భోగి రోజున విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రవితేజ క్రాక్ మిక్స్డ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మరోపక్క నిన్న సంక్రాంతి రోజున విడుదలైన రామ్ రెడ్ కి మిక్స్డ్ టాక్ రాగా.. అదే రోజున బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా కూడా విడుదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాకి ప్లాప్ టాక్ కాదు.. డిజాస్టర్ టాక్ పడింది.

Advertisement

మరి ముందుగా అంటే జనవరి తొమ్మిదిన థియేటర్స్ లోకి వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్లే. ఎందుకంటే పండగ సినిమాలేమన్నా హిట్ అయితే క్రాక్ జోరు థియేటర్స్ లో తగ్గేది. కానీ పండగ సినిమాలన్నీ ఢీలా పడడంతో రవితేజ క్రాక్ కాలక్షన్స్ లేస్తాయి. మాస్ మహారాజ్, మాస మసాలా క్రాక్ సినిమా ఈ పండగ బరిలో సేఫ్ అయిన మొదటి సినిమా కావడం, కేవలం బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలు మాత్రమే కాకుండా అనుకున్న అంచనాలను రీచ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కావడం అనేది ఇప్పుడున్న సినిమాల్లో క్రాక్ ఒక్కటే కనిపిస్తుంది. ఈ లెక్కన రవితేజ సంక్రాంతి రేస్ లో టాప్ లో ఉన్న హీరోగానే ఫిక్స్ అవ్వోచ్చేమో. 

Ravi Teja Sankranthi Hero?:

Ravi Teja Sankranthi Hero?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement