Advertisement

బాలయ్యని చూసి భయపడ్డాడా?


బాలకృష్ణ కి కోపమొస్తే ఎలా ఉంటుందో ఆయనతో కొట్టించుకున్న అభిమానులకి మాత్రమే తెలుసు అనుకుంటారు.. కానీ సోషల్ మీడియా ప్రాచుర్యం పొందాక బాలయ్య కోపాన్ని తరుచు చూస్తూనే ఉన్నాం. మొన్నీమధ్యనే కరోనా టైం లో సినిమా షూటింగ్స్ కి అనుమతుల కోసం ఏపీ,. టీఎస్ ప్రభుత్వాల సీఎం ల దగ్గరకు వెళ్లిన వాళ్లపై ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిన బాలయ్య తాజాగా ఏపీ రాజీకీయాల్లో నాకు ఎదురు నిలబడే దమ్ము ఎవరికీ లేదు.. ఉంటే నా బూతుల్లో కొట్టుకుపోతారనుకునే కోడలి నాని పై బాలయ్య ఇండైరెక్ట్ పంచ్ వైరల్ అయ్యింది. గత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో రామ తీర్ధం ఘటన ఎంత వేడినీ రాజేసిందో.. కోడలి నాని అనుచరులు పేకాట ఆడుతూ పోలీస్ లకు పట్టుపబడడం అంతే హీటెక్కించింది. కానీ కోడలి నాని మాత్రం పేకాట తప్పే కాదంటూ మాట్లాడడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. పేకాట ఆడితే పట్టుకుంటారు. పట్టుబడితే ఫైన్ కట్టి బయటకి వస్తారు.. వచ్చాక మళ్లీ ఆడుకుంటారు. పేకాట ఆడితే తప్పేమి కాదే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

Advertisement

దానితో మండిన బాలయ్య వేలు చూపిస్తూ రెచ్చగొట్టకండి.. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారు. న్యాయమన్నా, చట్టమన్నా లెక్కలేని తనం, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం, మొన్నెవరో వాడి తమ్ముడు పేకాటలో పట్టుబడితే.. మీ తమ్ముడేంటి పేకాటలో పట్టుబడ్డాడు అంటే.. ఆ ఏముంది వస్తాడు, పది వేలు కడతాడు, మళ్లీ పేకాడుతాడు.. అంటూ మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకో.. ఎవరికైనా చెబుతున్నాను,. మా సహనాన్ని పరీక్షించొద్దు, మేము మాటల మనుషలం కాదు, చేతల మనుషలం.. ఊరికే నోరు పారేసుకోవడం తగ్గించుకో.. జాగ్రత్త తస్మాస్ అంటూ బాలయ్య బాబు కోడలి నాని కి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

మరి ప్రభుత్వంతో పాటుగా, తన జోలికి వచ్చినా రాకపోయినా నోటికి ఆద్దు అదుపు లేని బూతులతో రెచ్చిపోయే కోడలి నాని బాలయ్య బాబుకి భయపడ్డాడా? బాలయ్య అంతలా వార్నింగ్ ఇచ్చాక నాని నుండి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడం చూసిన బాలయ్య అభిమానులు అదే అంటున్నారు. బాలయ్య బాబుకి కోడలి నాని భయపడ్డాడు. అందుకే నోరు ఎత్తడం లేదంటూ సోషల్ మీడియాలో నానిని డుకుంటున్నారు.

Frightened by Balayya?:

Balakrishna indirect punch on Kodali Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement