Advertisement
Google Ads BL

‘నారప్ప’.. ఏందప్పా.. అరిపించావ్‌గా!


ఎఫ్ 2 తర్వాత వెంకిమామ తో ప్లాప్ కొట్టిన వెంకటేష్ తన ఏజ్ కి సరిపోయే కథలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ అసురన్ రీమేక్ నారప్ప సినిమాలో  వెంకటేష్ ప్రియమణి తో కలిసి  నటిస్తున్నాడు. తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి తో ఎఫ్ 3 చెయ్యబోతున్నాడు. అయితే రేపు వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా వెంకటేష్ తాజా చిత్రం నారప్ప టీజర్ విడుదల చేసింది మూవీ టీం. అసలు అసురన్ సినిమా చూసాక ధనుష్ మాదిరి వెంకీ మెప్పించగలడా అనే అనుకున్నారు అంతా. కానీ తాజా నారప్ప టీజర్ లో వెంకటేష్ తప్ప ధనుష్ ఎక్కడా గుర్తుకు రాలేదు అంటే.. వెంకటేష్ నారప్ప పాత్రని ఎంత బాగా పండించాడో అర్ధమవుతుంది. 

Advertisement
CJ Advs

ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకునే వెంకీ అసురన్ రీమేక్ చేస్తున్నాడనగానే నారప్ప సినిమాపై అంచనాలు పెరిగిపోవడమే కాదు.. అసలు వెంకీకి అంతగా నచ్చిన అసురన్ లో అంత విశేషం ఏముందో అని .. ధనుష్ నటించిన అసురన్ సినిమాని ఓటిటి ద్వారా వీక్షించేసారు. మరి అసురన్ లో ధనుష్ పవర్ ఫుల్ పాత్రకి వెంకీ సెట్ అవుతాడా? ఆ పాత్రలో ఎలా ఉంటాడో అనుకుంటే..వెంకటేష్ ఆ అసురన్ నారప్ప పాత్రలో ఇరగదీసాడు. కళ్ళల్లో క్రూరత్వం, మోహంలో ఆగ్రహం, నారప్పగా వెంకటేష్ చాలా పవర్ ఫుల్ గెటప్ లో కనిపిస్తున్నాడు. మరి ప్లాప్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అసురన్ రీమేక్ ని ఏం చేస్తాడో అని భయపడిన వెంకీ అభిమానులు ఈ చిన్నపాటి నారప్ప టీజర్ చూసి టెంక్షన్ వదిలేసారు. అసురన్ గా ధనుష్ కన్నా నారప్పగా వెంకటేష్ లుక్ అదిరిందనే చెప్పాలి.

‘Narappa’, what an incarnation, commendable!:

Venkatesh - Srikanth Addala Narappa Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs