Advertisement

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో కొరటాల!


అదేమిటి చిరంజీవి ‘ఆచార్య’ని కొరటాల తెరకెక్కిస్తున్నాడు. తర్వాత అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చేశాడు. మధ్యలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి, కొరటాలతో సినిమా ఏమిటి అనే కన్ఫ్యూజన్‌లో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ అటు నిర్మాతగానూ, ఇటు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. చిరుతో ఆచార్య సినిమాతో పాటుగా కొత్త కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఆ కథలతో సినిమాలు చెయ్యడానికి కాదు.. ఓటీటీ వాళ్ళకి కొరటాల వెబ్ సిరీస్ చేయడానికి. అదిగో అందుకే శ్రీనివాస్ ఆత్రేయ అదేనండి నవీన్ పోలిశెట్టితో కొరటాల వెబ్ సీరీస్ ప్లాన్ చేశాడు.

Advertisement

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో డీల్ మాట్లాడిన కొరటాల శివ.. నవీన్ పోలిశెట్టితో వెబ్ సీరీస్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సీరీస్ కి కొరటాల శివ శిష్యుడు దర్శకత్వం వహిస్తాడని.. కొరటాల కేవలం కథ, ఇటు నిర్మాతగానూ కొనసాగుతుంది. అయితే వెబ్ సీరీస్ డైరెక్షన్ కూడా కొరటాల శివ కనుసన్నల్లోనే జరగబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాని పూర్తి చేశాడు. ఇక కొరటాల... నవీన్ అయితే తన వెబ్ సీరీస్ కి పర్ఫెక్ట్ అని అతనితో మాట్లాడి ఓకే చేశాడని అంటున్నారు. నవీన్ కూడా కొరటాల కథకి ఇంప్రెస్ అయ్యి ఈ వెబ్ సీరీస్ కి ఒప్పేసుకున్నాడనే టాక్ నడుస్తుంది.

Koratala Siva teams up with Naveen Polishetty:

Koratala Siva’s next film after Acharya to have Naveen Polishetty as the lead actor?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement