Advertisement
Google Ads BL

రష్మిక మరీ ఇంత ఎగ్జయిట్ అవుతుందేంటి?


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతుందని ఆ మూవీపై ప్రకటన వస్తుంది అని తెలుసు కానీ అసలా సినిమా పాన్ ఇండియా స్క్రిప్ట్ గా ఎప్పుడు మారిందో కూడా ఎవరికీ తెలియదు. అల్లు అర్జున్ పుష్ప కేరెక్టర్‌లో ఊర మాస్‌గా కనిపిస్తున్న లుక్ ని విడుదల చేస్తూ టైటిల్ తో పాటుగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ అని చెప్పడంతో అంతా అవాక్కయితే రష్మిక మాత్రం బాగా ఎగ్జైట్ అయ్యింది. కారణం అల్లు అర్జున్స్ సరసన అవకాశం రావడమే అదృష్టం అనుకుంటే.. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం మరింత అదృష్టంలా ఫీలవుతుంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాతో ఒకేసారి బన్నీతోనూ నటించడం, ఒకేసారి పాన్ ఇండియాకి వెళ్లడం జరుగుతుంది. తాజాగా కరోనా ఉన్నప్పటికీ షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకుంది ఈ సుందరి. అయితే పుష్పలో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పడమే కాదు... పుష్ప లో తాను చెయ్యబోయే పాత్ర కెరీర్ లో నిలిచిపోతుంది అని.. తనకి పుష్ప సినిమా ప్రత్యేకం అని చెబుతుంది రష్మిక. మరి రష్మిక ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో ఓ గిరిజన యువతి పాత్ర చేస్తుంది అని రష్మిక నటనలోని మరో కోణం ఈ పాత్ర ద్వారా ఎలివేట్ కాబోతుంది అని అందుకే రష్మిక పుష్ప సినిమా విషయంలో తెగ ఎగ్జైట్ అవుతుంది అని అంటున్నారు. 

మరి అల్లు అర్జున్ ఊర మాస్‌గా కనబడుతుంటే రష్మిక డీ గ్లామరస్‌గా ఆకట్టుకుంటుంది అన్నమాట. ఇక రష్మిక చిత్తూరు యాస ట్రైనింగ్ తీసుకుందట. మరి డీ గ్లామర్‌గా రష్మిక చిత్తూరు యాసలో అదరగొట్టేసేందుకు రెడీ అయిందనమాట. ఇకపోతే రష్మికాని మరో భారీ ప్రాజెక్ట్ అంటే.. సురేందర్ రెడ్డి - అఖిల్ సినిమాకి హీరోయిన్‌గా అడిగినట్లుగా ఫిలింనగర్ టాక్.

Rashmika excited on Bunny and Sukumar Pushpa:

Rashmika Mandanna reaction on Pushpa Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs