కమెడియన్ పంచ్.. రోజా వార్నింగ్..

తెలుగు టెలివిజన్లో తిరుగులేని కామెడీ షోగా పేరు తెచ్చుకుని విజయవంతంగా దూసుకువెళ్తున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోపై అప్పుడప్పుడు వివాదాలు కూడా వస్తుంటాయి. గత ఏడు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గ్యాప్ లేకుండా నవ్విస్తున్న ఈ ప్రోగ్రామ్, లాక్డౌన్ కారణంగా మూడు నెలలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 

అయితే తెలంగాణ ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ వారం టెలిక్యాస్ట్ అయిన ప్రోగ్రామ్ లో జరిగిన ఒక సంఘటన జడ్జ్ రోజాకి కోపం తెప్పించిందట. కామెడీ స్కిట్ లో భాగంగా కమెడియన్ ముక్కు అవినాష్, లాక్డౌన్ టైమ్ లో మద్యం ధరలు బాగా పెరిగాయని, ఒక్క బాటిల్ 9 వేలకి కొనుక్కున్నానని పంచ్ వేసాడు.

దాంతో వెంటనే జడ్జి రోజా అందుకుని, ఎవడు కొనమన్నాడంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది. అప్పటికి ఆ సమస్య పూర్తి కాలేదట. షో పూర్తయ్యాక రోజా అవినాష్ కి వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పంచులు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పిందట. లాక్డౌన్ తర్వాత ఏపీలో మద్యం ధరలు పెరిగాయన్న సంగతి తెలిసిందే. 

comedian punch.. Roja warning..:

comedian punch.. Roja warning..


LATEST NEWS